ఎన్నాళ్లకు తెలుగులో హిట్ అనే మాట వచ్చింది..

కొన్ని సినిమాల రిజల్ట్స్ చూస్తే కమర్షియల్ గా బిగ్ లాస్ తప్పదు అనుకుంటాం. కొన్నిసార్లు ఆ లెక్కలు తప్పుతాయి. అనుకున్నది ఒకటి అయినది ఒక్కటీ అనిపిస్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఓ డబ్బింగ్ సినిమా విషయంలో ఇదే జరిగింది. జూలై 28న విడుదలైన ఈ సినిమా వీకెండ్ కే లాభాలు తెచ్చేసుకుని ట్రేడ్ నే కాదు.. టాలీవుడ్ ను సైతం ఆశ్చర్యపరిచింది. ఏంటీ ఈ మధ్య హిట్లు లేవని ఇబ్బంది పడుతోన్న టాలీవుడ్ పై సెటైర్ వేస్తున్నా అనుకుంటున్నారు కదూ.. కానే కాదు. నిజంగానే హిట్ వచ్చేసింది. మరి ఆ సినిమా ఏంటో తెలుసా..?
విక్రాంత్ రోణా.. కన్నడ సూపర్ స్టార్ సుదీప్ నటించిన సినిమా. గత నెల 28న విడుదలైన ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియన్ లెవల్లో విడుదల చేశారు. తెలుగులోనూ బాగా ప్రమోషన్స్ చేశారు. ట్రైలర్ ఆకట్టుకుంది. విజువల్స్ కొత్తగా అనిపించాయి. దీంతో సుదీప్ కు ఈ మూవీ నుంచి తెలుగు మార్కెట్ స్టార్ట్ అవుతుందీ అనుకున్నారంతా. బట్ రిలీజ్ రోజునే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది విక్రాంత్ రోణా. అస్సలే మాత్రం కొత్తదనం లేని సినిమాగా తేల్చేశారు తెలుగు ఆడియన్స్. అఫ్‌ కోర్స్ ప్యాన్ ఇండియన్ లెవల్లో కూడా అదే పరిస్థితి. బట్.. అనూహ్యంగా ఈ సినిమా కొన్నవారికి లాభాలు తెచ్చింది.


కొన్నిసార్లంతే.. అనుకున్నది ఒకటీ అయ్యేది మరోటీ ఉంటుంది. విక్రాంత్ రోణ చిత్రాన్ని తెలుగులో కోటి 90 లక్షలకు కొన్నారు. బట్ వచ్చిన హైప్ వల్ల ఈ చిత్రం ఓపెనింగ్ రోజునే ఆ మొత్తాన్ని రాబట్టేసింది. అంటే నెగెటివ్ టాక్ వచ్చినా కొన్నవారికి నష్టాలు దాదాపు ఉండవు అని తేలిపోయింది. శుక్ర, శనివారాల్లో ఈ సినిమా థియేటర్స్ లో జనం లేకపోయినా.. ఆది వారం రోజు మాత్రం చాలా చోట్ల హౌస్ ఫుల్ అయింది. దీంతో ఫస్ట్ డే కలెక్షన్స్ రిపీట్ అయిపోయాయి. సో.. ఇప్పుడీ చిత్రం ఓవరాల్ గా 2 కోట్ల 60లక్షలు డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించింది. అంటే లాభాల్లోకి వచ్చేసిందన్నమాట. తక్కువకు కొన్నారు కాబట్టి ఇలాఅయింది అనుకోవచ్చు. కానీ ఎంతకు కొన్నారు అని కాదు.. పెట్టుబడిని మించి సాధిస్తే లాభమే కదా..?