Pawan Kalyan : క్రిస్మస్ కే పవన్ కళ్యాణ్‌ సినిమా

ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో క్రిస్మస్ ను పెద్ద సీజన్ గా భావించేవారు కాదు. అందుకే స్టార్ హీరోలెవరూ ఆ టైమ్ లో తమ సినిమాలు విడుదల చేసేవారు కాదు. బట్ ట్రెండ్ మారింది. ఇప్పుడు చిన్న పండగలకు కూడా పెద్ద హీరోలు కర్చీఫ్‌ లు వేస్తున్నారు. అయినా ఫెస్టివల్స్ కంటే కంటెంట్ కే ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు ఆడియన్స్. అందుకే ఎప్పుడు వచ్చారన్నది కాదు.. ఎలా ఉంది అన్నదే చూస్తున్నారు.

సైంధవ్ రిలీజ్ డేట్ అనౌన్స్ అయిన తర్వాత నాని30(Nani30) రిలీజ్ డేట్ గా డిసెంబర్ 21ని అనౌన్స్ చేశారు. అంటే వెంకీ కంటే ఒక రోజు ముందే నాని వస్తాడన్నమాట. డిసెంబర్ 22నే సుధీర్ బాబు(Sudheer Babu) హరోంహర చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు. వీళ్లెవరూ పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan) కు పోటీ కాదు కానీ అదే టైమ్ కు ఆయనా వస్తున్నాడని వినిపిస్తోంది.


సుజీత్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ”ఓ.జి”(O.G)(ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) చిత్రాన్ని డిసెంబర్ థర్డ్ వీక్ లోనే విడుదల చేస్తారు అని టాక్. ఈ మేరకు సుజిత్(Sujith) స్వయంగా పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్(Pawan Kalyan Fans) కే చెప్పాడట. అదెలా అంటే.. ప్రస్తుతం ఓజి మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సందర్భంగా కొంతమంది పవన్ కళ్యాణ్‌ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ను షూటింగ్ లొకేషన్ కు పిలిపించారట.

అక్కడే సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ మూవీని డిసెంబర్ మూడో వారంలోనే విడుదల చేస్తాం అని చెప్పాడట. బట్ అప్పుడే మేటర్ బయటకు రానివ్వొద్దు అని కూడా అన్నాట్ట. కానీ ఇంత మంచి న్యూస్ చెబితే పవన్ ఫ్యాన్స్ ఊరుకుంటారా..? అందుకే అలా ఓజి డిసెంబర్ లోనే రిలీజ్ అనే టాక్ బయటకు వచ్చేసింది. మరి ఇది నిజమా కాదా అనేది ప్రొడక్షన్ హౌస్ నుంచి స్పష్టమైన అప్డేట్ వస్తే కానీ తెలియదు.

Related Posts