గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ట్రైలర్.. ఊరమాస్ లుక్ లో విశ్వక్ సేన్

నేటితరం యువ కథానాయకుల్లో మంచి ఫామ్ లో ఉన్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. సినిమాల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ.. వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటోన్న విశ్వక్ సేన్ ఇప్పుడు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. విశ్వక్ కి జోడీగా అంజలి, నేహా శెట్టి నటించారు. సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌజ్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో కృష్ణ చైతన్య తెరకెక్కించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మే 31న విడుదలకు ముస్తాబవుతోంది. లేటెస్ట్ గా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ట్రైలర్ ను చూస్తే.. ఇప్పటివరకూ చూడనటువంటి ఊర మాస్ లుక్ లో మెస్మరైజ్ చేస్తున్నాడు విశ్వక్ సేన్. అలాగే.. ఆద్యంతం గోదావరి యాక్సెంట్ తో అదరగొడుతున్నాడు. గోదావరి జిల్లాల్లోని రాజకీయాల నేపథ్యంలో ఫక్తు మాస్ ఎంటర్ టైనర్ గా కృష్ణ చైతన్య తీర్చిదిద్దిన ఈ మూవీ ట్రైలర్ అయితే కేక అనిపించేలా ఉంది. విశ్వక్ సేన్ స్వాగ్, ఊరమాస్ డైలాగ్స్ మాస్ కు బాగా చేరువయ్యేలా ఉన్నాయి.

ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ తో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’పై మంచి బజ్ ఏర్పడింది. ఈ ట్రైలర్ తో ఆ అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. వచ్చే వారం థియేటర్లలోకి వస్తోన్న చిత్రాలలో హాట్ ఫేవరెట్ గా రంగంలోకి దిగుతోంది ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.

Related Posts