‘కల్కి‘ నుంచి విడుదలైన భైరవ ఏంథెమ్

లేటుగా వచ్చినా.. లేటెస్ట్ గా వచ్చాడు ‘భైరవ‘. రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి‘ నుంచి ఫస్ట్ సింగిల్ ‘భైరవ ఏంథెమ్‘ వచ్చేసింది. ‘ఒకనేనే నాకు చుట్టూ నేనే.. ఒకటైన ఒంటరోడ్ని కానే.. స్వార్థము నేనే.. పరమార్థము నేనే..‘ అంటూ రామజోగయ్య శాస్త్రి, కుమార్ రాసిన ఈ గీతాన్ని దీపక్ బ్లూ, దిల్జీత్ దొసాంజ్, సంతోష్ నారాయణన్ సంయుక్తంగా ఆలపించారు. సంతోష్ నారాయణన్ సంగీతంలో రూపొందిన ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇక.. ఇండియాస్ మోస్ట్ సెలబ్రేటెడ్ యాక్టర్ ప్రభాస్, ఇండియాస్ మోస్ట్ సెలబ్రేటెడ్ సింగర్ దిల్జీత్ కలిసి ఈ పాటలో సందడి చేశారు. భైరవ పాత్ర సాహసాలను, వ్యక్తిత్వాన్ని చూపిస్తూ సాగిన ఈ పాట ఆకట్టుకుంటుంది.

Related Posts