ఎదురు నిలిచినా.. ఎవరికీ ఎనిమీ కాని ఒకే ఒక్కడు

సూపర్ స్టార్ కృష్ణ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆ స్థాయి ఉన్నత మైన వ్యక్తిత్వం ఆయనది. సినిమా హీరోగా ఉన్నా.. ఇతర హీరోల్లా ఎప్పుడూ భేషజాలు చూపించలేదు. తానో వీరుడు, శూరుడు అన్న తరహాలో ఎప్పుడూ ఎవరితోనూ ప్రవర్తించలేదు. తనను తాను సినిమా నటుడుగా కంటే ఓ మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగానే చూసుకున్నాడు. అందుకే ఆయన హీరో కృష్ణగానే అభిమానులను సంపాదించుకున్నారు. ఆ కాలంలో ఉన్నట్టుగా సినిమా నటుడు అనగానే దేవుడు రేంజ్ లో ఊహించేసుకుని జనం మధ్యా అలాగే “నటిస్తూ” ఎప్పుడూ కనిపించలేదు సూపర్ స్టార్ కృష్ణ. ఎన్టీఆర్, ఏఎన్నార్, కాంతారావు వంటి