ఉన్నదాంతో ఆనందంగా ఉందాం. ఉన్నంత సేపూ సంతోషంగా ఉందాం అనే స్లోగన్ని మళ్లీ మళ్లీ చెబుతోంది అనుపమ పరమేశ్వరన్. పెద్ద పెద్ద సక్సెస్లు వచ్చినా సరే, నాకు దక్కాల్సినవి నాకు దక్కేతీరుతాయి. అతిగా ఆశ పడక్కర్లేదనే మాటకు స్టిక్ ఆన్ అయింది. ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ ని సొంతం చేసుకుంది అనుపమ పరమేశ్వరన్. ఆల్రెడీ సంక్రాంతికి వచ్చిన రౌడీ బోయ్స్ హిట్. దిల్రాజు వారసుడిని ఇంట్రడ్యూస్ చేస్తూ రౌడీ బోయ్స్ ని తెరకెక్కించి సంక్రాంతికి రిలీజ్ చేశారు. సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. రీసెంట్గా రిలీజైన కార్తికేయ2 చాలా పెద్ద హిట్ అయింది. బాలీవుడ్ జనాలు ఆశ్చర్యపోయి చూసేలా వసూలు చేస్తోంది కార్తికేయ2. బ్రహ్మాస్త్ర ఈ నెల 9న విడుదల కాబోతోంది.
అప్పటిలోపు కార్తికేయ2 ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలన్న కుతూహలం కనిపిస్తోంది నార్త్ జనాల్లో. ఓవరాల్గా వంద కోట్ల మార్క్ దాటేసిన కార్తికేయ2, హిందీలో మాత్రం 30 ప్లస్ క్రోర్స్ కలెక్ట్ చేసింది.ఇంత పెద్ద సక్సెస్ ఉన్నా దాన్ని క్యాష్ చేసుకునే ఆలోచనలో లేదు అనుపమ. ఆల్రెడీ ఈ లేడీ చేతిలో 18 పేజెస్, బటర్ఫ్లై సినిమాలున్నాయి. తమిళంలో ఇప్పుడు ఇంకో సినిమాకు సైన్ చేసింది. అది కూడా సోలో హీరోయిన్గా కాదు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ కీర్తీ సురేష్ మెయిన్ లీడ్ చేస్తోంది ఆ సినిమాలో.
జయం రవికి బెస్ట్ బాండింగ్ ఉన్న కేరక్టర్ కాబట్టి అనుపమ ఈ మూవీకి ఓకే చెప్పేసిందని టాక్. సినిమాలో హీరో ఎవరైనా, హీరోయిన్ ఎవరైనా సరే, పర్ఫెక్ట్ కథ, తన కేరక్టర్ బావుంటే మూవీకి ఓకే చెప్పేస్తుంది ఈ మల్లు బ్యూటీ. డైరక్షన్ డిపార్ట్ మెంట్లోనూ అనుభవం సంపాదించుకుంటున్న అనుపమ ఈ మధ్య మరీ నాజూగ్గా మారింది. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ అందంగా ఉన్నట్టే, సంతృప్తితో జీవించే వారందరూ ఆరోగ్యంగా ఉన్నట్టే అనే ఫార్ములాను నమ్ముతానని అంటోంది అనుపమ పరమేశ్వరన్.