లాల్ సింగ్ చడ్డా మూవీ రివ్యూ ..

ఆమిర్ ఖాన్.. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పిలుచుకునే హీరో. వైవిధ్యమైన కథలతో బలమైన ఇంపాక్ట్ చూపించే నటుడు. అందుకే అతనికి దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. లాల్ సింగ్ చడ్డా అనే సినిమాతో వస్తున్నప్పుడు అతనిపై ఒక వర్గం వాళ్లు తీవ్రంగా వ్యతిరేకత చూపించారు. బాయ్ కాట్ లాల్ సింగ్ చడ్డా అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. అయినా దేశమంతా తిరిగి ప్రమోషన్స్ చేశాడు ఆమిర్. తెలుగులో చిరంజీవి ప్రమోట్ చేయడంతో ఇక్కడా అంచనాలు వచ్చాయి. ఫైనల్ గా ఈ గురువారం విడుదలైన లాల్ సింగ్ ఎలా ఉంది..? అంచనాలను అందుకుందా లేదా అనేది చూద్దాం.

లాల్ సింగ్ చడ్డా కథగా చూస్తే పుట్టుకతోనే మానసికంగా సరిగా ఎదగన లాల్ సింగ్ చడ్డా(ఆమిర్ ఖాన్) కు అంగ వైకల్యం కూడా ఉంటుంది. తన స్నేహితురాలు రూప(కరీనా కపూర్ ఖాన్) స్నేహంతో ఆ వైకల్యాన్ని జయిస్తాడు. చిన్నప్పుడు స్నేహితుల హేళనలను తప్పించేందుకు మొదలైన పరుగు అతని కెరీర్ గా మారి ఆర్మీలోకి వెళ్లేలా చేస్తుంది. పైగా ఈ సింగ్ గారి ఫ్యామిలీ అంతా యుద్ధాల్లోనే చనిపోయి ఉంటారు. ఆ కారణంగానే అతని తల్లి లాల్ ను కూడా ఆర్మీలోకి వెళ్లమని ప్రోత్సహిస్తుంది. ఆటల్లో నైపుణ్యం వల్ల సైన్యంలో చేరిన లాల్ కు అక్కడ బాలరాజు(బాలరాజు) పరిచయం అవుతాడు. అమ్మ, రూప తర్వాత బాలరాజు అంటే లాల్ కు బాగా ఇష్టం కలుగుతుంది. వీరు సైన్యంలో ఉండగానే జరిగిన కార్గిల్ వార్ లో బాలరాజు చనిపోతాడు. లాల్ గాయపడతాడు. ఆ కారణంగా ఆర్మీ నుంచి బయటకు వచ్చి బాలరాజు చెప్పిన బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. మరి ఆ బిజినెస్ ఏంటీ.. తను ప్రేమించిన రూప ఏమైపోతుంది..? చివరికి లాల్ జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంది అనేది మిగతా కథ.

లాల్ సింగ్ చడ్డా.. అస్సలే మాత్రం ఆకట్టుకోలేకపోయిన సినిమా. ఏ దశలోనూ ఆసక్తిని కలిగించలేకపోయింది. మానసికంగా సరిగా ఎదగని బాలుడు నుంచి మొదలైన పాత్ర చివరి వరకూ అలాగే ఉంటుంది. ఇలాంటి పాత్రలపై చిన్నప్పటి నుంచే ఓ సింపతీ యాడ్ అయితే అతని చర్యలు చూస్తున్నవారికి అర్థం అవుతాయి. కానీ ఆ పాత్రపై సింపతీ రాకపోగా మాటిమాటికీ ఆమిర్ ‘ఊ’కొట్టడం, తల అటూ ఇటూ తిప్పడం చూస్తే చిరాకు అనిపిస్తుంది. అందుకే ఆ పాత్ర