భీమా రివ్యూ

గోపీచంద్ , మాళవిక శర్మ, ప్రియాభవాని శంకర్‌ మెయిన్ లీడ్‌ గా ఎ. హర్ష డైరెక్షన్‌లో కెకె రాధామోహన్‌ నిర్మించిన మూవీ ‘భీమా’ . భారీ అంచనాలున్నాయి. సెమీ ఫాంటలసీ ఎలిమెంట్ ఉన్న కమర్షియల్ మూవీ కావడంతో బజ్ బాగా పెరిగింది. అ అంచనాలను భీమా అందుకుందా ?


ఎలాంటి క్రిమినల్‌నైనా ఆటకట్టించే పోలీసాఫీసర్‌ భీమా ( గోపీచంద్) . స్కూల్ టీచర్‌ గా పనిచేస్తున్న విద్య తో లవ్‌లో పడిపోతాడు. అయితే మహేంద్రగిరికి రాజులాంటి భవాని ( ముఖేష్‌తివారి) కి భీమా కొరకరాని కొయ్యలా మారతాడు. ఆయుర్వేద మందులతో ఊరిని కాపాడుతున్న రవీంద్ర వర్మ ( నాజర్ ) భీమాని ఓ కోరిక కోరతాడు. ఆ తర్వాత ఏం జరిగింది భవానీ, భీమాల మధ్య గొడవేంటి ? వర్మ చెప్పిన మాట భీమా ఎలా తీర్చాడనేది తెరమీద చూడాల్సిందే.


గోపీచంద్ మాస్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లు బోర్‌ కొట్టే స్థాయికి వచ్చేసాయి. అయితే ఇందులో ఉన్న పురాణాల పాయింట్‌కు లింక్ చేస్తూ చేసిన యాక్షన్‌ ఎలిమెంట్స్‌ కాస్త ఇంట్రస్టింగ్ పాయింట్‌. పరశురాముని క్షేత్రం గురించి తెలుపుతూ వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. ఎమోషన్స్, పవర్‌ఫుల్ డైలాగ్‌లు, కీలకమైన ట్విస్ట్ మరియు హీరోయిజం ఎలివేషన్ సన్నివేశాలు చక్కగా కుదిరాయి మరియు వీటి కారణంగా సీన్స్ బాగా పండుతాయి. వెన్నెల కిషోర్ మరియు రోహిణి పాల్గొన్న కొన్ని కామెడీ మూమెంట్స్ బాగా వచ్చ�