తెలుగు సినిమా నిర్మాతల ఆవేదన..

తెలుగు సినిమా స్థాయి పెరుగుతోంది.. ఇది ఒకవైపు వినిపిస్తోన్న మాట. నిర్మాణ ఖర్చు భారీగా పెరిగిపోయింది. ఇది నిర్మాతల వైపు నుంచి వినిపిస్తోన్న మాట. రెండూ నిజాలే. కానీ ఈ స్థితికి కారణం ఎవరూ అంటే ఖచ్చితంగా సమాధానం ఏదో ఒకవైపు వెళ్లాల్సిందే కదా. అలా వెళితే అది ఎవరివైపు.. స్థాయి వైపా లేక నిర్మాణ ఖర్చువైపా.. ఏదో ఒకటి అయితే దీనికీ కారణం ఎవరూ.. అనేది తెలుసుకునే ముందు అసలు ఈ సిట్యుయేషన్ ఏంటో చూద్దాం.తాజాగా తెలుగు సినిమా నిర్మాతల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించిన అంశాలు.. నిర్మాణ ఖర్చులు విపిరీతంగా పెరిగిపోయాయి అని.. అందుకు కారణాలేంటీ అనే విషయాల మీద జరిగాయి. ప్రధానంగా తేలినవి రెండు. ఒకటి రెమ్యూనరేషన్స్. రెండురీసెంట్ గా జరిగిన సినీ కార్మికులు సమ్మె. ఎవరు సమ్మె చేసినా, డిమాండ్ చేసినా దాని భారం, ప్రభావం అంతిమంగా పడేది నిర్మాతలపైనే. దీంతో ప్రధానంగా నష్టపోతున్నది వాళ్లే. అలాగే సినిమా పోయినా ఆ నష్టాన్ని భరించాల్సిందే. ఏదో కొందరు హీరోలు తప్ప ఇంకెవరూ దాన్ని భరించేందుకు ముందుకు రారు.

దీనివల్ల తమకు ఒరుగుతున్నది ఏంటీ అనే తర్జన భర్జనలు జరిగాయి. దీంతో అసలు వాళ్లూ వీళ్లూ ఏంటీ ”మనమే సమ్మె చేస్తే” అన్న ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన అందరికీ నచ్చింది. కట్ చేస్తే సినిమా షూటింగ్స్ ఆపేయాలనే నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచనలు కొనసాగుతున్నాయి.నిజానికి సినిమా షూటింగ్ ఆపాలన్న నిర్ణయం ముందే అనుకున్నది. అయితే అప్పుడు త్వరలో ప్రారంభం కాబోతోన్న చిత్రాల గురించి మాత్రమే అనుకున్నారట. కానీ ఈ మీటింగ్ లో చర్చించిన తర్వాత అందరికంటే ఎక్కువగా నష్టపోతున్నది తామే కనుక అసలు మొత్తం షూటింగ్ లే ఆపేస్తే అన్న నిర్ణయానికి ఎక్కువ మంది ఆమోద ముద్ర వేశారు. కట్ చేస్తే ఈ సమ్మె ఎప్పటి నుంచి ఎలా జరుగుతుంది. నిర్మాతల డిమాండ్స్ ఏంటీ అనేది త్వరలోనే చెబుతారు.అయితే నిర్మాతల ఆవేదన అర్థం చేసుకోదగ్గదే. అంతిమంగా సినిమా పరిశ్రమలో అత్యధికంగా నష్టపోతున్నది నిర్మాతలే. కానీ ఈ దుస్థితికి కారణం ఎవరూ అంటే నిర్మొహమాటంగా నిర్మాతలే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. 2000 సంవత్సరం వరకూ తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతలుగా కాక ‘కంపెనీలు” ఉన్నాయి. వారి బ్యానర్ లో సినిమా అంటే ఖచ్చితంగా పదిమందికి పని దొరుకుతుంది. �