గ్రాండ్‌గా ‘ ఈగల్‌ ‘ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌

మాస్‌ మహరాజా రవితేజ, అనుపమ పరమేశ్వరన్‌, కావ్యా థాపర్ మెయిన్‌లీడ్‌లో టీజి విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న మూవీ ఈగల్‌. కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకుడు. మోస్ట్‌ స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా రాబోతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9 న రిలీజ్‌ కాబోతున్న సందర్భంగా ప్రీరిలీజ్‌ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్ గా జరిగింది.


ఈ చిత్రంలో నటించిన యాక్టర్స్ తో నటించడం ఇదే ఫస్ట్ టైమ్. ఈ కథను నడిపించే పాత్రలో అనుపమా అద్భుతంగా నటించింది. నవదీప్‌ కు సూపర్బ్ పాత్ర పడింది. అద్భుతంగా డైలాగ్స్ చెప్పాడు. నవదీప్ కామెడీ టైమింగ్ సూపర్బ్..ఇద్దరం కలిసి ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌ చేయాలనుందన్నాడు మాస్‌ మహరాజా రవితేజ. ఈ చిత్ర నిర్మాత టీజి విశ్వప్రసాద్‌ చాలా క్లారిటీ ఉన్న నిర్మాత. నేను కూడ అంతే క్లారిటీ ఉంటాను కాబట్టి ప్రొడ్యూసర్‌ నాకు నచ్చుతారన్నారు. డైరెక్టర్‌ కార్తీక్‌ ఘట్టమనేనికి విపరీతమైన క్లారిటీ ఉంది. సినిమా చాలా బాగా తీసాడన్నారు.

ఈ చిత్రంలో రవితేజ గారు ఆద్భుతంగా నటించారు. ఆయనతో కలిసి మరిన్ని సినిమాల్లో నటించాలనుంది అన్నారు అనుపమ పరమేశ్వరన్‌. ఈ చిత్ర దర్శకుడు కార్తీక్‌ని అన్నయ్యా అని పిలుస్తాను. నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఇది రెండో సినిమా. అందరి యాక్టర్స్‌తో నాకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందన్నారు హీరోయిన్‌ అనుపమా పరమేశ్వరన్.

రవితేజ గారు చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న హీరో. ఈ చిత్రంలో రచన పాత్రకు న్యాయం చేసానని అనుకుంటున్నానన్నారు మరో హీరోయిన్ కావ్యా థాపర్. ఇందులో సరికొత్త ప్రేమకథ ఉంది.. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్‌ చెప్పారు కావ్యా థాపర్.
రవితేజ తో కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది.. ఆయనతో ఓ మంచి కామెడీ సినిమాలో చేయాలని ఆశ ఉందన్నారు నవదీప్‌. పీపుల్ మీడియా సంస్థలో దాదాపు పాతిక సినిమాలు ప్రొడ్యూస్ చేసింది. గొప్ప గొప్ప సినిమాలు ఈ బ్యానర్ నుంచి వచ్చాయి. తనకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్‌ అన్నారు నవదీప్‌.

నిర్మాత టీజి విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ.. ఈగల్ సినిమా మంచి స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. ఈ సినిమాలో యాక్షన్‌, మెసేజ్‌ తో పాటు అద్భుతమై క్లైమాక్స్‌ ఉంటుంది. రవితేజ గారు కొత్త దర్శకులకు ఛాన్స్ ఇచ్చినట్లే మాబ్యానర్‌కు మూడు సినిమాలిచ్చారు. ఆర్టిస్టులందరితో మల్టిపుల్ సినిమాలు చేస్తున్నాం అన్నారు. ఫిబ్రవరి 9 న సినిమా రిలీజ్ కాబోతుంది. తప్పకుండా సక్సెస్‌ అవుతుందని నమ్మకం వ్యక్తం చేసారు విశ్వప్రసాద్‌.

దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మాట్లాడుతూ.. ఈ చిత్రంలో దాదాపు 300 మంది పనిచేసారు. ఇంతమంది పేర్లు ఎండ్‌ టైటిల్స్ చూస్తుంటే గర్వంగా ఉంది.. ఈ అవకాశం ఇచ్చిన రవితేజ గారికి చాలా థ్యాంక్స్‌ అన్నారు. యాక్టర్స్ కాంబినేషన్‌ కూడా చాలా కొత్తగా ఉంటుందన్నారు డైరెక్టర్‌. మణి రాసిన డైలాగ్స్ అలరిస్తాయన్నారు. ఖచ్చితంగా ఆడియెన్స్‌ ను ఈగల్‌ థ్రిల్ చేస్తుందన్నారు.
ఇంకా ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అవసరాల శ్రీనివాస్‌, దర్శకుడు వంశీకృష్ణ, డైరెక్టర్‌ అనుదీప్‌ , దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య లు మాట్లాడుతూ.. చిత్ర విజయాన్ని కాంక్షిస్తూ.. చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు.

Related Posts