టైమ్ ట్రావెల్ చేస్తోన్న మన కథానాయకులు

టైమును మన కంట్రోల్ లో పెట్టుకుని.. స్విఛ్ నొక్కితే చాలు మనకు నచ్చిన కాలానికి వెళ్లిపోతే ఎలాగుంటోంది? అలాంటి అనుభూతినే అందిస్తాయి టైమ్ ట్రావెలింగ్ మూవీస్. మన టాలీవుడ్ స్టార్స్ అప్పుడప్పుడూ టైమ్ ట్రావెల్ చేసిన వారే. నందమూరి బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369‘ సినిమాతోనే తెలుగులో టైమ్ ట్రావెల్ స్టోరీస్ మొదలయ్యాయి.

బాలకృష్ణ నటించిన చిత్రాల్లో ‘ఆదిత్య 369’ ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. టైమ్‌ మెషీన్ బ్యాక్‌ డ్రాప్‌లో సైన్స్‌ ఫిక్షన్ కథాంశంతో సాగే ఈ సినిమా 1991లో విడుదలై ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణకుమార్‌గా రెండు పాత్రల్లో ద్విపాత్రాభినయంతో అదరగొట్టాడు బాలయ్య. ప్రయోగాత్మక కథాంశాలకు పెట్టింది పేరైన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు.. ఈ సినిమాలో అటు 14వ శతాబ్దానికి చెందిన విజయనగర సామ్రాజ్యాన్ని.. అలాగే 2504వ సంవత్సరంలోని ఫ్యూచర్ వరల్డ్ ని సరికొత్తగా ఆవిష్కరించారు.

బాబాయ్ బాలకృష్ణ బాటలోనే అబ్బాయ్ కళ్యాణ్ రామ్ నటించిన టైమ్ ట్రావెల్ మూవీ ‘బింబిసార’. క్రీస్తు పూర్వానికి.. ప్రస్తుత కాలానికి లింక్ పెడుతూ వశిష్ట తెరకెక్కించిన ‘బింబిసార’ బంపర్ హిట్ సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ రెడీ అవుతోంది. శర్వానంద్ హీరోగా రూపొందిన ‘ఒకే ఒక జీవితం’ కూడా �