‘హనుమాన్‘ ట్రైలర్.. ఆద్యంతం విజువల్ వండర్

పేరుకు చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా లెవెల్ లో భారీ స్థాయిలో విడుదలకు ముస్తాబవుతోన్న చిత్రం ‘హనుమాన్’. ఇప్పటివరకూ హాలీవుడ్ సూపర్ హీరోస్ మూవీస్ చూసుంటారు.. కానీ మన సూపర్ హీరో హనుమాన్ ముందు వాళ్లంతా జీరో అంటూ ఇప్పటికే ప్రమోషన్స్ లో జోరు చూపించింది టీమ్. లేటెస్ట్ గా ‘హనుమాన్‘ మూవీ ట్రైలర్ రిలీజయ్యింది.

అఖండ భారత ఇతిహాసం ప్రేరణతో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ముందుగా ఓ టైటిల్ కార్డ్ వేశారు. అండర్ వాటర్ ఎపిసోడ్స్ తో హనుమాన్ గా తేజ సజ్జా ఎంట్రీ కూడా అదిరింది. ఆ తర్వాత చిరుతతోనే పరుగు పందెం వేసి.. సూపర్ హీరోగా తేజ సజ్జా చేసే సాహసాలు ట్రైలర్ లో హైలైట్. హీరోకి అక్క పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటించినట్టు ట్రైలర్ ను బట్టి అర్థమవుతో�