ముహూర్తాన్ని జరుపుకున్న రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్‘ మూవీ

నేషనల్ క్రష్ రష్మిక లీడ్ రోల్ లో కనిపించబోతున్న ‘ది గర్ల్ ఫ్రెండ్‘ మూవీ ముహూర్తాన్ని పూర్తిచేసుకుంది. ఈ చిత్రానికి నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘చి.ల.సౌ, మన్మథుడు 2‘ సినిమాల తర్వాత రాహుల్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై అల్లు అరవింద్ సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది.

‘ది గర్ల్ ఫ్రెండ్‘ సినిమా ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్ నివ్వగా, డైరెక్టర్ మారుతి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. మరో డైరెక్టర్ సాయి రాజేశ్ ఫస్ట్ షాట్ కు దర్శకత్వం వహించారు. వైవిధ్యమైన ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది. గతంలోనే ఈ సినిమాకి సంబంధించి ఓ స్మాల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. అప్పటి నుంచే ఈ మూవీ పట్ల సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. త్వరలో పట్టాలెక్కే ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Related Posts