‘టిల్లు స్క్వేర్’ నుంచి వచ్చేసిన ‘రాధిక’ సాంగ్

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్ కాంబోలో వస్తోన్న చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్‌ గా రూపొందుతోన్న ఈ సినిమాకి మల్లిక్ రామ్ దర్శకుడు. ‘డిజె టిల్లు’తో రాధిక అనేది ఓ బ్రాండ్ నేమ్ లా మారింది. ఇప్పుడు సీక్వెల్ లోనూ రాధిక ప్రస్తావన ఉండబోతుంది. ఇందులో రాధిక పేరుతోనే ఓ పాట ఉంది. లేటెస్ట్ గా ‘టిల్లు స్క్వేర్’ నుంచి ‘రాధిక’ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

రామ్ మిరియాల తన విలక్షణ శైలిలో పాటను స్వరపరచడమే కాకుండా తానే స్వయంగా ఆలపించాడు. ఈ గీతానికి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించాడు. ఇప్పటికే విడుదలైన మొదటి గీతం ‘టికెట్టే కొనకుండా’లో అనుపమ గ్లామరస్ అవతార్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇప్పుడు రెండవ గీతంలో కూడా ఆమె అందం, అభినయం ఆకట్టుకుంటున్నాయి. ఇక.. స్టార్ బాయ్ సిద్ధు ఎప్పటిలాగే తనదైన పెర్ఫామెన్స్ తో అదరగొట్టబోతున్నట్టు ఈ పాటను చూస్తే అర్థమవుతోంది. వచ్చే యేడాది ఫిబ్రవరి 9న ‘టిల్లు స్క్వేర్’ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts