మన ‘హనుమాన్’ ముందు అందరూ జీరో

వచ్చాడు కొత్త సూపర్ హీరో.. మన హనుమాన్ ముందు అందరూ జీరో’ అంటూ ‘హనుమాన్’ నుంచి కొత్త పాట వచ్చేసింది. హాలీవుడ్ సూపర్ హీరోస్ అందరితోనూ కంపేర్ చేస్తూ.. మన హనుమాన్ ముందు వారంతా జీరో అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటుంది. యానిమేషన్ తో సరికొత్తగా డిజైన్ చేసిన ఈ లిరికల్ సాంగ్ లో మధ్యలో హీరో తన సూపర్ పవర్స్ తో అలరించే సన్నివేశాల తాలూకు విజువల్స్ బాగున్నాయి. అనుదీప్ దేవ్ సంగీతంలో కృష్ణకాంత్ రాసిన ఈ పాటను సాయి వేద వాగ్దేవి, ప్రకృతి రెడ్డి, మయూఖ్ ఆలపించారు.