‘డంకి‘ ప్రభాస్ కి పోటీనే కాదు

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మధ్య క్రిస్మస్ వార్ కన్ఫమ్ అయిన విషయం తెలిసిందే. షారుక్ ‘డంకి‘, ప్రభాస్ ‘సలార్‘ చిత్రాలు ఒకే రోజున విడుదలకు ముస్తాబవుతున్నాయి. అయితే.. ‘సలార్‘కి పెద్ద కాంపిటేషన్ గా నిలుస్తుందనుకున్న ‘డంకి‘ చిత్రం ఒక విషయంలో మాత్రం బాగా వెనుకబడిపోయిందనే విమర్శలు వస్తున్నాయి.

ఈ ఏడాది షారుక్ ఖాన్ నుంచి వచ్చిన ‘పఠాన్, జవాన్‘ చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. ఈ రెండు సినిమాలూ వరల్డ్ వైడ్ గా వెయ్యేసి కోట్లు వసూళ్లను దాటేశాయి.

షారుక్ తో పాటు.. బాలీవుడ్ ని కూడా మళ్లీ ఫుల్ ఫామ్ లో నిలబెట్టిన చిత్రాలుగా ‘పఠాన్, జవాన్‘ సినిమాలను విశ్లేషించారు ట్రేడ్ పండిట్స్. అయితే లేటెస్ట్ గా వస్తోన్న ‘డంకి‘ మాత్రం ఈ సినిమాలకు భిన్నంగా రాబోతుంది.

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, ఇప్పటివరకూ బాలీవుడ్ లో అపజయమెరుగని దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి కాంబోలో ‘డంకి‘ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ఆద్యంతం హిరాణి మార్క్ కామెడీ, ఫ్యామిలీ, ఎమోషన్స్ తో రాబోతున్నట్టు లేటెస్ట్ గా రిలీజైన గ్లింప్స్ ను బట్టి అర్థమవుతోంది. ఈ సినిమాలో మళ్లీ పాత షారుక్ ని చూసే అవకాశం ఉంది. అదే సమయంలో ‘పఠాన్, జవాన్‘ సినిమాలతో యాక్షన్ స్టార్ గా మారిన షారుక్ నుంచి ఊర మాస్ యాక్షన్ ను మిస్సయ్యే ఛాన్స్ ఉంది. ఈనేపథ్యంలో డిసెంబర్ లో రాబోతున్న క్రేజీ బాక్సాఫీస్ వార్ లో ‘సలార్‘కి ‘డంకి‘ ఏమాత్రం పోటీ కాదనే కామెంట్స్ జోరందుకున్నాయి. ‘సలార్‘ ఊర మాస్ యాక్షన్ తో అలరించడానికి సిద్ధమవుతుంటే.. ‘డంకి‘ ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ రాబోతుంది.

Related Posts