గణపత్ కూడా దసరాకేనా

బాలీవుడ్ వారికి సౌత్ ఆడియన్స్ టేస్ట్ బాగా తెలిసినట్టుంది. యాక్షన్ సినిమా అంటే చాలు.. అన్ని భాషల్లో విడుదల అంటూ హడావిడీ చేస్తున్నారు. ఇప్పటికే పఠాన్, జవాన్ లతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన బాలీవుడ్.. వరుసగా వాళ్ల యాక్షన్ సినిమాలన్నీ ఇక్కడా విడదల చేయడానికి ప్లాన్ చేసుకుంటోంది.ఈ క్రమంలో దసరా బరిలో మరో స్టార్ వస్తున్నాడు. ఒకప్పటి స్టార్ హీరో జాకీ ష్రాఫ్‌ తనయుడు టైగర్ ష్రాఫ్‌ హీరోగా నటించిన కొత్త సినిమా గణపత్ ను ఈ దసరా సందర్భంగా అక్టోబర్ 20న విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేస్తూ ఓ తెలుగు టీజర్ కూడా విడుదల చేశారు.


ఈ టీజర్ చూస్తే వీళ్లు కూడా ప్రభాస్ కల్కి లాగా భవిష్యత్ కాలానికి వెళ్లారు అని తెలుస్తుంది. ఈ కథ 2070 కాలంలో సాగేది అని చెబుతున్నారు. ఆ కాలంలో ప్రపంచం అంతా ఆశలు వదిలేసుకుని.. ఓ దయలేని మనుషుల మధ్య ఉండాల్సి వస్తుంది. అప్పుడు.. ” మనకోసం ఒక వీరుడు వచ్చే వరకూ ఈ యుద్ధం మొదలుపెట్టొద్దు..” అంటూ ఒక వాయిస్ ఓవర్ వస్తుండగా.. ఒంటరిగా ధ్యానం చేసుకుంటున్న ఒక కుర్రాడి కోసం పదుల సంఖ్యలో మనుషులు వస్తారు. అతను వాళ్లందరినీ అంతం చేస్తాడు. అంటే వీళ్లు ఎదురు చూస్తున్న వీరుడు అతనే అని చెప్పకనే చెప్పారు.


ఇక అక్కడ నుంచి టీజర్ అంతా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ తో నింపేశారు. హీరోయిన్ కృతి సనన్ సైతం భారీ స్టంట్స్ చేసింది. కథా కాలం 2070దే అయినా ఇప్పటి ఫైట్లు, ఇప్పటి డ్యాన్సులు, ఇప్పటికే కాస్ట్యూమ్స్.. ఇక హీరో చివర్లో ‘ మా వాళ్ల జోలికి వస్తే అస్సలు వదిలిపెట్టను’ అంటాడు. ఆ మా వాళ్లు జాబితాలో ఉండేది ఎవరు.. వారి కోసం ఈ హీరో ఎందుకు ఉద్బవించాడు అనేది సినిమాలో చూడాలి.


ఇక ఈ చిత్రంలో అబితాబ్ వచ్చన్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. కొందరు ఈ చిత్ర టీజర్ కు కల్కి పోలికలు ఉన్నాయంటున్నారు కానీ.. అవేం లేదు. కాకపోతే భవిష్యత్ కాలంలో సాగే కథగా మాత్రం కనిపిస్తోంది. గణపత్ ఇప్పటి నుంచి యాభైయేళ్లు ముందుకు వెళ్లింది అంతే. కల్కి ఏకంగా ఆరు ఐదు వందల యేళ్లు ముందు కాలంలో సాగే కథ. అంచేత రెండిటికీ పోలికలు లేవు.
మరి దసరా బరిలో అక్టోబర్ 20న విడుదల కాబోతోన్న ఈ గణపత్ మన సినిమాలకు ఏదైనా విగ్నం కలిగిస్తాడా లేదా అనేది చూడాలి.

Related Posts