1987నాటి వంగవీటి రంగా సినిమా వస్తోంది..

వంగవీటి మోహన రంగా.. ఆంధ్రలో కాపులకు సంబంధించి ఓ ఆరాధ్య నాయకుడు. చాలా చిన్న స్థానం నుంచి మొదలై రాష్ట్రంలో ఎన్నికలు, ప్రభుత్వాలనే ప్రభావితం చేసేంత పెద్ద స్థాయికి ఎదిగాడు రంగా. అప్పట్లో ఆయన మాటే శాసనం అన్నట్టుగా ఉండేది అని చెబుతారు. అయితే నాటి ఎన్టీఆర్ ప్రభుత్వ తీరుపై నిరసనగా ఆయన ఓ చిత్రాన్ని నిర్మించారు

. ” చైతన్య రథం” అనే పేరుతో రూపొందిన ఈ సినిమా 1987లో రిలీజ్ అయింది. ఎన్టీఆర్ పార్టీ స్థాపించి రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి ఉపయోగించిన వాహనానికి కూడా చైతన్య రథం అనే పేరు ఉంది. దానికి సెటైరికల్ గానే ఈ టైటిల్ ఎంచుకున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ప్రభుత్వ అక్రమాలు, అవినీతిని ప్రశ్నిస్తూ ఓ పాట ఉంది. ఆ పాటవల్ల నాటి ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి.

ప్రభుత్వ ఆస్తులుధ్వంసం అయ్యాయి. కొందరు ఏకంగా ఈ సినిమా ప్రదర్శిస్తోన్న థియేటర్స్ ను కూడా ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రింట్స్ ను కూడా దహనం చేశారు అని చెబుతారు.


ఈ సినిమా విడుదలైన మరుసటి యేడాది 1988లో రంగా దారుణ హత్యకు గురయ్యాడు. ఆయన్ని ఎవరు చంపారు. చంపడంలో ఎవరి ప్రోత్సాహం ఉంది.. అనేది రాజకీయంగా అందరికీ తెలుసు. అయితే ఈ చైతన్య రథం చిత్రానికి సంబంధించి ఒక్క ప్రింట్ దొరికింది. దీంతో దాన్ని ఈ టెక్నాలజీకి అనుగుణంగా అప్టేడ్ చేసి ముందుగా అమెరికాలో విడుదల చేశారు.

త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో కూడా విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని రంగా తనయుడు వంగవీటి రాధా చెబుతున్నాడు.


ఇక 1988లో ధవళ సత్యం డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో భాను చందర్, శరత్ బాబు, కోట శ్రీనివాసరావు, కల్పన తదితరులు నటించారు. రాధా మిత్రమండలి నిర్మాణ సంస్థ వారు నిర్మించారు. జెవి రాఘవులు సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ బావుంటాయి. ఆ పాటలను జాలాది రాజారావు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, మైలవరపు గోపీ రాశారు.


మరి ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా కాపులకు సంబంధించిన అంశం ఇంకా రగులుతూనే ఉంది కాబట్టి.. ఈ చైతన్య రథం రీ రిలీజ్ అయితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Related Posts