సాయితేజ్ కాదు.. గోలి శంకర్

విరూపాక్షతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నడు సాయితేజ్. యాక్సిడెంట్ తర్వాత చేసిన ఈ సినిమాకు ఏ సింపతీ అక్కర్లేకుండా కేవలం కంటెంట్ బలం వల్లే బాక్సాఫీస్ ను షేక్ చేసింది. సంక్రాంతి సినిమాల తర్వాత జెన్యూన్ గా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అనిపించుకున్న సినిమా ఇదే కావడం విశేషం. ఇక ఈ చిత్రానికి ముందు చేసిన రిపబ్లిక్ కూడా కంటెంట్ బేస్డ్ మూవీనే.

దీంతో రొటీన్ అవుతుందనుకున్నాడో లేక మాస్ ను వదలొద్దు అని భావించాడో కానీ నెక్ట్స్ మూవీతో కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ను ఎంచుకున్నాడు. ఆల్రెడీ మెగా కాంపౌండ్ లో రచ్చతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన సంపత్ నంది డైరెక్ట్ చేస్తోన్న చిత్రం ఇది. సంపత్ గోపీచంద్ చేసిన గౌతమ్ నందా ఆకట్టుకోలేకపోయినా మళ్లీ గోపీచంద్ తోనే సీటీమార్ తీసి సూపర్ అనిపించుకున్నాడు. మరీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పలేం కానీ కమర్షియల్ గా మంచి విజయం సాధించిందీ చిత్రం.


ఇక సంపత్ నంది డైరెక్షన్ లో సాయిధరమ్ తేజ్ చేస్తోన్న సినిమాకు ”గోలి శంకర్” అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో నటించే హీరోయిన్ తో పాటు ఇతర కాస్టింగ్ కు సంబంధించిన వివరాలు ఇంకా చెప్పలేదు. కానీ టైటిల్ మాత్రం దాదాపు ఇదే ఫిక్స్ అంటున్నారు. ఇక టైటిల్ చూస్తుంటే ఇది ఎంత కమర్షియల్ మూవీనో అర్థం అవుతుంది. పైగా ఈ తరహా టైటిల్స్ సాయితేజ్ కు బానే సరిపోతాయి. నిజానికి కొన్నాళ్లుగా సాయితేజ్ కథలు, కంటెంట్స్ రిపీట్ కాకుండా చూసుకుంటున్నాడు.


సుప్రీమ్ హిట్ తర్వాత వరుసగా ఆరు ఫ్లాపులు పడ్డాయి సాయితేజ్ కి. దీంతో అంతకు ముందు సాయిధరమ్ తేజ్ గా ఉన్న తన పేరు కూడా సాయితేజ్ గా కుదించుకుని చిత్రలహరి, ప్రతి రోజూ పండగే, సోలో బ్రతుకే సో బెటర్ వంటి మూవీస్ తో హ్యాట్రిక్ కొట్టాడు. ఈ మూడూ డిఫరెంట్ కంటెంట్స్.

ఇక రిపబ్లిక్, విరూపాక్ష కూడా అంతే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో కలిసి ఫస్ట్ టైమ్ బ్రో అనే సినిమాలో నటించాడు. ఇందులో పవన్ కంటే తనకే స్క్రీన్ స్పేస్ ఎక్కువ. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జూలై 28న విడుదల కాబోతోంది. సో.. ఇన్ని వైవిధ్యమైన సినిమాల తర్వాత మాస్ మూవీతో వస్తున్నాడన్నమాట. మరి ఈ గోలి శంకర్ సాయితేజ్ కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో..?

Related Posts