ఇండిపెండెన్స్ డే కు బాలీవుడ్ లో భారీ వార్

ఇండిపెండెన్స్ డే అంటే సౌత్ లో తక్కువే కానీ బాలీవుడ్ లో మాత్రం బాక్సాఫీస్ వార్ స్ట్రాంగ్ గా ఉంటుంది. స్టార్ హీరోల నుంచి స్మాల్ హీరోల వరకూ తలపడుతుంటారు. అంతిమంగా కంటెంట్ కే కాసులు దక్కుతాయి అనేది అందరికీ తెలిసిందే. ఇక ఈ యేడాది ఇండిపెండెన్స్ డేకు కూడా బాలీవుడ్ లో భారీ పోటీ ఉంది. అయితే కొన్నాళ్లుగా అక్కడ ఎప్పుడు ఏ సినిమా విజయం సాధిస్తుంది అనేది ఎవరూ ఊహించలేకపోతున్నారు.

ఈ యేడాది కాలంలో భారీ హిట్ అంటే కేవలం పఠాన్ ను మాత్రమే చూపిస్తున్నారు తప్ప మరో సినిమా కనిపించడం లేదు. మధ్యలో కొన్ని సినిమాలు హిట్ అనిపించుకున్నా.. కలెక్షన్స్ పరంగా 100 కోట్లు దాటినవి ఒకటీ రెండు మాత్రమే. సో.. దీన్ని బట్టి బాలీవుడ్ బాక్సాఫీస్ ఎంత నీరసంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నీరసానికి బూస్టప్ ఇస్తూ.. ఆగస్ట్ సెకండ్ వీక్ లో స్టార్ వార్ జరగబోతోంది. అయితే ఈ వార్ లో అందరి కళ్లూ మన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తోన్న ”యానిమల్”పైనే ఉండటం విశేషం.


రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తోన్న చిత్రం యానిమల్. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా.. ఇప్పటి వరకూ రణ్ బీర్ కపూర్ చేయని పాత్రగా ఈ మూవీ రూపొందుతోందని కొన్నాళ్లుగా వస్తోన్న పోస్టర్స్ చూస్తుంటేనే తెలుస్తుంది. ఇక ఈ మూవీలో రణ్‌ బీర్ ఫిజిక్స్ లెక్చరర్ గా కనిపిస్తాడట. అలాంటి తను అనుకోకుండా మాఫియాడాన్ గా ఎదుగుతాడు. అందుకు కారణాలేంటీ..? మరి ఈ ఫిజిక్స్ లెక్చరర్ డాన్ గానే మిగిలాడా మళ్లీ పాఠాలు చెబుతాడా అనేది తెరపై చూడాలి. ఈ యానిమల్ ను ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. రీసెంట్ గా పోస్ట్ పోన్ అవుతందనే మాటలు వినిపించాయి. బట్ వాటిని ఖండిస్తూ ఖచ్చితంగా అదే రోజు వస్తున్నాం అని మూవీ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.


ఇక ఇండిపెండెన్స్ డే సందర్భంగానే “గదర్2” విడుదల కాబోతోంది. 2001 జూన్ 15న విడుదలైన ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇంకా చెబితే బాలీవుడ్ ఆల్ టైమ్ టాప్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. కేవలం 19 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే ఏకంగా 135 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. అనిల్ శర్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అమీషా పటేల్ హీరోయిన్ గా నటించింది. 1947లో ఇండియా – పాకిస్తాన్ వేర్పాటులో జరిగిన అల్లర్ల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో పాకిస్తాన్ ఎపిసోడ్ హైలెట్ గా నిలిచింది. అలాంటి చిత్రాన్ని దాదాపు అదే టీమ్ తో మళ్లీ రూపొందించాడు దర్శకుడు అనిల్ శర్మ. ఈ చిత్రం ఆగస్ట్ 11న విడుదల కాబోతోంది.


దీంతో పాటు అక్షయ్ కుమార్ దేవుడు పాత్రలో నటించిన ఓ మై గాడ్ చిత్రానికి సీక్వెల్ గా ఇప్పుడు ఓ మై గాడ్ 2 వస్తోంది. 2012లో వచ్చిన ఓ మై గాడ్ సంచలన విజయం సాధించింది. దేవుడికి, దేవుడంటే నమ్మకం లేని వ్యక్తికి మధ్య జరిగే కథగా వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అయితే ఈ సారి ఇదే చిత్రాన్ని ఇండియాలోని సెక్స్ ఎడ్యుకేషన్ నేపథ్యంలో రూపొందించారట. ఇక ఈ మూవీని కూడా ఆగస్ట్ 11నే విడుదల చేయబోతున్నారు. మొత్తంగా బాలీవుడ్ లో ఈ ట్రైయాంగిల్ ఫైట్ లో మెజారిటీ ఆడియన్స్ యానిమిల్ కు ఓటు వేస్తున్నారు. ఓటు వేసినంత మాత్రాన హిట్ వస్తుందని కాదు. కానీ ఈ వార్ లో విన్నర్ ఎవరనేది చూడటానికి బాలీవుడ్ కూడా ఈగర్ గా ఎదురుచూస్తోంది.

Related Posts