DJ Tillu : డిజే టిల్లు2 నుంచి బిగ్ అప్డేట్

డిజే టిల్లు.. లాస్ట్ ఇయర్ టాలీవుడ్లో ఎవరూ ఊహించని బ్లాక్ బస్టర్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో 2022 ఫిబ్రవరి 12న విడుదలైన ఈ మూవీకి యూనానిమస్ గా హిట్ టాక్ వచ్చింది. ముఖ్యంగా టిల్లు, రాధికల పాత్రలు ప్రతి ఒక్కరికీ రిజిస్టర్ కావడమే కాదు.. చాలామందికి సినిమాలోని అన్ని డైలాగ్స్ గుర్తున్నాయి.

చూడ్డానికి కామెడీ ఎంటర్టైనర్ లా కనిపించినా.. హ్యూమన్ ఎమోషన్స్ తో పాటు డబ్బుంటే మనిషి తన రిలేషన్స్ ను వదులుకుంటాడు.. మనీ వల్ల మానవత్వం ఎలా మారిపోతుంది అనే కోణాలు కూడా కనిపిస్తాయీ చిత్రంలో. ఇక రాధిక పాత్రలో నటించిన సెన్సువల్ బ్యూటీ నేహా శెట్టి గ్లామర్ తో పాటు సిద్ధు జొన్నలగడ్డతో తన కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయ్యాయి.

అందుకే ఈ మూవీ ఇప్పటికీ ఇంకా చెబితే ఎప్పటికీ చాలామందికి మోస్ట్ ఫేవరెట్ మూవీగా నిలుస్తుందని చెప్పొచ్చు. అలాంటి చిత్రానికి సీక్వెల్ అంటే ప్రేక్షకుల అంచనాలు మరో రేంజ్ లో ఉంటాయి. ఆ అంచనాలను అందుకునేందుకు ఈ సారి డిజే టిల్లు స్క్వేర్ అంటూ వస్తున్నాడు సిద్ధు.


ఫస్ట్ పార్ట్ కు విమల్ కృష్ణ డైరెక్ట్ చేశాడు. రెండో పార్ట్ కు అతనికీ హీరోకు మధ్య విభేదాలు వచ్చాయి అని చెప్పారు. అందుకే ఈ సారి మల్లిక్ రామ్ సెకండ్ పార్ట్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ డిజే టిల్లు స్క్వేర్ లో ఈ సారి రాధిక పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తుండటం విశేషం.

ఇక ఈ చిత్రాన్ని ఈ యేడాది సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే హీరోయ