నేను స్టూడెంట్ సర్

రివ్యూ: నేను స్టూడెంట్ సర్
తారాగణం: బెల్లంకొండ గణేష్‌, అవంతిక దాసాని, సముద్రఖని, సునిల్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రామ్ ప్రసాద్, చరణ్ దీప్ తదితరులు
ఎడిటర్: చోటా కే ప్రసాద్
సంగీతం: మహతి స్వర సాగర్
డివోపి: అనిత్ మాధాడి
నిర్మాత: నాంది సతీష్‌ వర్మ
దర్శకత్వం: రాఖి ఉప్పలపాటి

తొలి సినిమా స్వాతిముత్యంతో ఆకట్టుకున్నాడు గణేష్‌. సితార వంటి పెద్ద బ్యానర్ లో వచ్చిన ఈ చిత్రం ఓ మోస్తరుగా మెప్పించింది. రెండో ప్రయత్నంగా ఇప్పుడు నేను స్టూడెంట్ సర్ అనే మూవీతో వచ్చాడు. టైటిల్ నుంచే ఆకట్టుకున్న నేను స్టూడెంట్ సర్ ను నాంది చిత్ర నిర్మాత సతీష్ వర్మ నిర్మించడంతో పాటు నాంది రేంజ్ లో ఆకట్టుకుంటుంది అని ప్రమోషన్స్ లో ఊదరగొట్టారు. స్టూడెంట్ కథే అయినా థ్రిల్లర్ గానూ ఉంటుందన్నారు. మరి ఈ శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ :
సుబ్బారావు(గణేష్‌) కాలేజ్ స్టూడెంట్. అతనికి ఐఫోన్ అంటే పిచ్చి. దానికోసం ఇంట్లో వారిని కూడా అడగకుండా సొంతంగా ఎన్నో పనులు చేసి డబ్బు కూడబెట్టుకుంటాడు. 90వేలు పోగు చేసి తనకు ఎంతో ఇష్టమైన ఐఫోన్ కొనుక్కుంటాడు. అలా కాలేజ్ కు వెళ్లిన అతనికి అదే రోజు కాలేజ్ లో జరిగిన గొడవ వల్ల పోలీస్ లు అరెస్ట్ చేస్తారు. తనకు సంబంధం లేకపోయినా గుంపులో అరెస్ట్ అవుతాడు. పోలీస్ స్టేషన్ లో అతని ఫోన్ మిస్ అవుతుంది. తన ఫోన్ పోలీస్ లే దొంగతనం చేశారని నిలదీస్తాడు. ఇందుకోసం కమీషనర్ వరకూ వెళ్లి వారిని ఇరిటేట్ చేస్తాడు. దీంతో ఫోన్ దొరికినా పగలగొడతా అంటాడు కమీషనర్. దీంతో అతని కూతురుతో స్నేహం చేసి ఆమె సాయంతో కమీషనర్ గన్ కొట్టేస్తాడు. తన ఫోన్ ఇస్తే గన్ ఇస్తా అని కమీషనర్ కు ఫోన్ చేస్తాడు. అదే సమయంలో ఆ గన్ తోనే ఓ హత్య జరిగి