Santhosh : కుర్రాడికి మరో ఫ్లాప్ పడినట్టేనా..?

అదేంటో కానీ కొంతమందికి ఎంత ప్రతిభ ఉన్నా అదృష్టం మాత్రం కలిసి రాదు.పైగా ఇండస్ట్రీలో సపోర్ట్ చేసేవారు కూడా ఉంటారు. డైరెక్ట్ గానో, ఇన్ డైరెక్ట్ గానో అతని సినిమా ఆడాలని ఏదో రకంగా సాయం చేస్తుంటారు. ఇన్ని ఉన్నా.. ఏళ్లుగా ఒక సాలిడ్ హిట్ కోసం చూస్తున్న కుర్రాడు సంతోష్ శోభన్.

ఇన్నాళ్లలో ఏక్ మినీ కథ మాత్రమే హిట్ అనిపించుకుంది. అలాగని అదేం బ్లాక్ బస్టర్ కాదు. జస్ట్ హిట్. ఇక మిగతావన్నీ ఫ్లాపులే. చిత్రం ఏంటంటే.. ఇతను చాల వేగంగా సినిమాలు చేస్తున్నాడు. ఈ వేగంలో కథ గురించి మర్చిపోతున్నాడని వేరే చెప్పక్కర్లేదు. కొన్నిసార్లు, దర్శకుడో, బ్యానర్ నో నమ్మి మోసపోతున్నాడేమో అనిపిస్తుంద.

ముఖ్యంగా లేటెస్ట్ గా వచ్చిన అన్ని మంచి శకునములే సినిమా విషయంలో అతను డైరెక్టర్ నందిని రెడ్డి, బ్యానర్ ను బ్లైండ్ గా ఫాలో అయిపోయాడు. పైగా భారీ ప్యాడింగ్ కూడా ఉందీ సినిమాలో. ఇన్ని ఉన్నా.. సరైన కంటెంట్ మాత్రం కనిపించలేదు. దీంతో అన్నీ మంచి శకునములే కాస్ట్ లీ మిస్ ఫైర్ అనిపించుకుంది.
అన్ని మంచి శకునములే గొప్ప కథ కాదు. ఏళ్ల తరబడి వెండితెరపై అరిగిపోయిన అదే కథ.

రెండు కుటుంబాలు.. ఆ కుటుంబాల్లోని ఇద్దరు పిల్లలు. పెద్దవాళ్లకు పడదు. చిన్నవాళ్లు ప్రేమలో పడతారు. పెద్దాళ్లను ఎదురించకూడదు. అలాగని ప్రేమను వదలుకోకూడదు. ఇదే ఫార్మాట్లో వచ్చిందీ సినిమా. అయితే ఈ తరహా కథలు ఎన్ని వచ్చినా.. బలమైన ఎమోషన్స్ ను క్యారీ చేసేలా స్టోరీ అనే థ్రెడ్ ఉంటే వర్కవుట్ అవుతుంది. ఈ సినిమాలో ఆ కథే మిస్ అయింది.