ఫిబ్రవరి సినిమాల పరిస్థితేంటీ.. రిలీజ్ డేట్ ప్లాన్ చేసుకున్న సినిమాలేంటీ..?

ఒక్క మార్పు.. పరిశ్రమనే కుదిపేసింది. ఆ మార్పు పేరు ఆర్ఆర్ఆర్. వీళ్లు దసరాకు వచ్చినా పోయేది అని టాలీవుడ్ అంతా ఫీలవుతోంది. వీళ్లు పోస్ట్ పోన్ కావడంతో ఇప్పుడు ఫిబ్రవరి సినిమాలకూ కొత్త చిక్కొచ్చింది. ఆ చిక్కుకు మరో కారణం ఒమిక్రాన్ భయం. మరోవైపు కరోనా కూడా విజృంభిస్తోంది. మరి ఇప్పుడు పోస్ట్ పోన్ అయిన సినిమాల సంగతి పక్కన బెడితే.. ఫిబ్రవరి లో రిలీజ్ అయ్యే మూవీస్ అయినా వస్తాయా..? అసలు ఫిబ్రవరిలో రిలీజ్ ప్లాన్ చేసుకున్న చిత్రాలేంటీ..?
సంక్రాంతిని భారీ కాన్వాస్ తో ఊహించుకుంది టాలీవుడ్. అటు ప్రేక్షకులు కూడా భీమ్లానాయక్, రాధేశ్యామ్, సర్కారువారి పాట, ఎఫ్3, బంగార్రాజు అంటూ అబ్బో చాలామందితో ఈ సారి సంక్రాంతి ముందెన్నడూ లేనంత గొప్పగా ఎంటర్టైన్ చేయబోతోందనుకున్నారు. కానీ అదే టైమ్ కు ఆర్ఆర్ఆర్ అనౌన్స్ కాగానే అంతా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. కేవలం రాధేశ్యామ్, బంగార్రాజు మాత్రమే మిగిలాయి. ఇప్పుడు చూస్తే ఒమిక్రాన్ కారణంగా ట్రిపుల్ ఆర్ వాయిదా పడింది. దీంతో పోస్ట్ పోన్ అయిన సినిమా మేకర్�