ఆస్కార్ ను గెలిచిన తెలుగువాడి నాటు దనం

తెలుగు సినిమా.. ఎన్ని మైలురాళ్లు దాటింది. ఎన్ని అపురూప విజయాలు చూసింది. ఎన్ని రికార్డులు, రివార్డుల కొల్లగొట్టింది..? వందేళ్ల తెలుగు సినిమా చరిత్రకు ఇవాళ ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కింది. ఇంకా చెబితే 1931లో వచ్చిన భక్త ప్రహ్లాద నుంచి మొదలైన నేపథ్య గానం, గేయరచనల స్ఫూర్తి నేడు ఆ చంద్ర తారార్కం నిలిచే కీర్తిని గడించింది. ఇన్నాళ్లూ.. ఇన్నేళ్లూ.. ఇది మనది కాదు..

ఇది మనకు దక్కదు అని భారతీయ సినిమా భావించిన ఆస్కార్ అవార్డ్ ఇవాళ తెలుగు వాడి వాణికి, బాణీకి తలవంచక తప్పలేదు. ఒక్క పాటతోనే ఎన్నో సినిమాలు ఓపెనింగ్స్ తెచ్చుకున్న చరిత్రను చూశాం. సినిమాలు ఎలా ఉన్నా.. ఆ పాట కోసం రిపీటెడ్ ఆడయన్స్ నూ మన థియేటర్స్ చూశాయి. అప్పుడు అవి మనకే పరిమితం. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట దేశాన్ని దాటి ఖండాంతరాలను ఊపేసింది. పాటలోని సాహిత్యం అందరికీ అర్థం కాకపోయినా..

ఆ పాటకు కట్టిన బీట్ కు తెలియకుండానే అడుగులు కదిపింది ప్రపంచం. సినిమాలో ఈ పాట వస్తున్నప్పుడు భాషతో పనిలేకుండా.. ఏ దేశం అన్న భేదం కనిపించకుండా ప్రతి ఒక్కరూ చిందులు వేశారు. థియేటర్ లో ఆ పాటను సెలబ్రేట్ చేసుకున్నారు. అలాంటి పాటకు ఇవాళ ప్రపంచమంతా గర్వంగా చెప్పుకునే.. ఇంకా చెబితే.. ప్రపంచ సినిమాకు ఇదే అత్యుత్తమ అవార్డ్ గా భావించే ఆస్కార్ రావడంలో ఆశ్చర్యమేం లేదు. కానీ ఈ పాట వెనక కృషి, సాహిత్యంతో పాటు బాణీ కోసం, ఆ బాణీని సార్వజనీనం చేయడంలో సంగీత దర్శకుడి ప్రతిభ, గాయకుల పర్ఫెక్షన్.. ఈ మొత్తాన్ని ఆబాలగోపాలం అలరించేలా సినిమా దర్శకుడి ఆలోచనకు అనుగుణంగా నృత్యాలు సమకూర్చిన �