యూట్యూబ్ లో హాల్ చల్ చేస్తున్న MEN WILL BE MEN – SIDE देंगे 

సృజనాత్మకతకు హద్దులు లేవన్నది వాస్తవం. టెక్ ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కాలంలో యువతీ, యువకులు తమ అభిరుచికి తగిన రంగంలో తమతమ ప్రావీణ్యాన్ని నిరూపించుకుంటుండటం తెలిసిందే! ఆ కోవలోకే యువకుడు చరణ్ రచన, దర్శకత్వంలో రీసెంట్ గా యూట్యూబ్ లో విడుదలైన ఓ షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు హాల్ చల్ చేస్తోంది. అబ్బాయిల మనస్తత్వానికి దగ్గరగా ఈ ఫిల్మ్ నేపథ్యం ఉండటంతో టీనేజ్, యంగేజ్ వయస్సుల వారికి ఇట్టే ఈ ఫిల్మ్ కనెక్ట్ అయిపొయింది..మరి […]

హ్యాకింగ్ గుప్పిట ప్రపంచం..

ప్రపంచానికి పెను ఉప్పెన..ఇదేదో ప్రకృతి ప్రకోపం మూలంగానో ఇంకేదో విధంగానో వచ్చింది కాదు! గత కొన్నెండ్లుగా టెక్నాలజీ ప్రపంచాన్ని గడగడలాడిస్తూ వస్తున్న సైబర్ ఎక్స్‌ టార్షన్ పేరుతో జరిపే ర్యాన్సమ్ మోసం ఇప్పుడు తాజాగా,  ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద సైబర్‌ దాడికి ఈ శుక్రవారం సాక్ష్యంగా నిలిచింది. ఇండియా సహా సుమారు  74 దేశాల్లో ఒకేరోజు సుమారు పది గంటల వ్యవధిలో సైబర్‌ నేరగాళ్లు దాదాపు 45వేల హ్యాకింగ్‌లకు పాల్పడటాన్ని చూస్తే  టెక్ విపత్కర […]

షాకింగ్! డ్యాన్స్ చేస్తూ వరుడు తిరిగిరాని లోకాలకు!!

పెళ్లి వూరేగింపే ఆ వరుడికి ఆఖరి క్షణంగా మారింది. డ్యాన్స్‌ చేస్తున్నపెళ్లికొడుకు హఠాత్తుగా మరణించిన ఘటన గుజరాత్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వడోదరకు చెందిన వరుడిని అతని స్నేహితులు భుజంపై ఎక్కించుకుని పెళ్లికి వూరేగింపుగా తీసుకెళ్తున్నారు. పెళ్లికొడుకు కూడా ఉత్సాహంగా డ్యాన్స్‌ చేశాడు. ఇంతలో ఏమైందో ఏమో గానీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని కిందకి దింపి లేపడానికి చాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికే వరుడు చనిపోవడంతో పెళ్లిమండపంలో విషాదం నెలకొంది.

మణిరత్నం ప్రేమకథను మరిపించిన లవ్ స్టోరీ!

ఎక్కడ జరిగిందో స్పష్టతలేదు కానీ స్వచ్ఛమైన ప్రేమకు ఓటమి ఉండదనడానికి మరో ఉదాహరణ.. విమానంలో ప్రయాణిస్తుండగా పైలట్‌ చేసిన ఓ లవ్‌ ప్రపోజల్‌ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి కొంత మంది కొన్ని రకాల పద్ధతులను ఫాలో అవడం తెలిసిందే, ఐతే, ఎయిర్‌ హోస్టెస్‌ తమ పనుల్లో మునిగి ఉండగా ఇంతలో అదే విమానంలోని  పైలట్‌ అక్కడకు వచ్చాడు. విమానంలో ఉండే ఫోన్‌ లో ఏదో విషయం చెప్పగానే ఓ ఎయిర్‌ […]

ఫుడ్ ట్వీట్ కు 34,30,500 రీట్వీట్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన యువకుడు

ట్విట్టర్ లో ఓ యువకుడు పెట్టిన అమాయకమైన ట్వీట్ 34,30,500 సార్లు రీట్వీట్ అయి ప్రపంచ రికార్డును సృష్టించడం విశేషం. ఇక, వివరాల్లోకి వెళ్తే…అమెరికాలోని వాషింగ్టన్ కు చెందిన కార్టర్‌ విల్కర్సన్‌ (16) కు చికెన్ నగెట్స్ అంటే చాలా ఇష్టం. దీంతో ఓ ఫాస్ట్‌ ఫుడ్‌ రెస్టారెంట్‌ కు వెళ్లి చికెన్‌ నగెట్స్‌ ఆర్డరిచ్చాడు. అవి అతనికి చాలా బాగా నచ్చాయి. దీంతో ఆవురావురుమంటూ ఆరగించిన విల్కర్సన్…అక్కడ ఒక సెల్పీ దిగి…దానిని ట్విట్టర్ లో పోస్టు […]

పిల్ల దూడను చూసి అంత పెద్ద ఏనుగు ఎందుకు భయపడింది? నిజం ఇదిగో!!

  ఏనుగుని చూస్తే మనుషులే భయపడిపోతారు. ఇక దాని ముందు జంతువులెంత? కానీ, ఓ దూడ ఏకంగా గజరాజునే భయపెట్టి పారిపోయేలా చేసింది. దక్షిణాఫ్రికాలోని క్రూగర్‌ జాతీయ పార్కులో చోటుచేసుకుంది ఈ ఘటన. ఓ గేదె, తన దూడతో కలిసి వెళుతుంటే వాటిని అనుసరిస్తూ వెనుకే ఏనుగు వెళ్తొంది. ఏనుగు తమపై దాడి చేసేందుకు వస్తోందని పొరపడిన దూడ దానికి ఎదురు నిలిచింది. దాంతో ఏనుగు పక్కకు తిరిగి వెళ్లిపోయింది. అదే సమయంలో ఆండ్రూ కోహెన్‌ అనే […]

భారత్ లో అడుగుపెట్టిన కెనెడియన్ పాప్ తరంగం జస్టిన్ బీబర్… పోటెత్తిన అభిమానులు

చిన్న వయసులోనే పాప్ స్టార్ గా ఎదిగి, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను ఆటపాటలతో అలరిస్తున్న కెనెడియన్ పాప్ సంగీత కెరటం జస్టిన్ బీబర్ తొలిసారి భారత్ వచ్చాడు. అర్ధరాత్రి ముంబైలోని శివాజీ అంతర్జాతీయ టెర్మినల్  కు ప్రత్యేక విమానంలో చేరుకున్నాడు. ఈ సందర్భంగా జస్టిన్ బీబర్ ను చూసేందుకు అభిమానులు చాలా ఉత్సాహం చూపారు. అయితే బీబర్ ఎవరికీ కనిపించకుండా మరో మార్గంలో హోటల్ కు వెళ్లిపోవడం విశేషం. ఐదు రోజుల భారత పర్యటనలో […]

ప్రధానిని నవ్వించిన అక్కీ!

ఈ యేడు జాతీయ ఉత్త‌మ న‌టుడు అవార్డు అందుకున్న బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ ఆ త‌ర్వాత ప్ర‌ధాని మోడిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లుసుకున్నారు.. ఈ సంద‌ర్భంగా ఉత్త‌మ న‌టుడి అవార్దు అందుకున్నందుకు అక్ష‌య్ ను ప్రధాని  అభినందించారు.. తాజాగా అక్షయ్‌ ‘టాయ్‌లెట్‌-ఏక్‌ ప్రేమ్‌కథా’ సినిమాలో నటిస్తున్నాడు. ప్ర‌ధాని ప్రారంభించిన ‘స్వచ్ఛ భారత్‌’క్యాంపెయిన్‌ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర విశేషాల‌ను మోడీకి వివ‌రించాడు అక్కి. ఈ సినిమా టైటిల్‌ గురించి చెప్పగానే మోదీ నవ్వు ఆపుకోలేకపోయారట. […]

ఏదో అనుకుంటే, ఏదో అయింది!

  మలబద్ధకం పోగొట్టుకోవడానికి ఓ వ్యక్తి చేసిన వింత ప్రయోగం అతని ప్రాణాలమీదికే రావడం గమనార్హం. . ఈ ఘటన చైనాలోని గాంగ్జూలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకెళితే, మలబద్ధకం పోగొట్టుకోవడానికి మలద్వారం గుండా ఈల్‌ చేపను పొట్టలోకి పంపించుకున్న చైనాకు చెందిన ఓ బాధితుడు.. పొట్ట ఉబ్బరంగా ఉండటంతో వైద్యుల వద్దకు వెళ్లగా,పరిశీలించిన వైద్యులు కడుపులో ఈల్‌ చేప ఉన్నట్లు గుర్తించి ఆశ్చర్యపోయారు. దీంతో వెంటనే శస్త్రచికిత్స చేసి బతికున్న ఈల్‌ చేపను వైద్యులు బయటకు తీశారు. […]

న్యాయ వ్యవస్థలోనే సంచలనం.. జస్టిస్ సీఎస్ కర్ణన్‌కు 6 నెలలు జైలు శిక్ష

గత కొద్ది రోజులుగా తీవ్ర దుమారం రేపిన సీఎస్ కర్ణన్‌ వ్యాఖ్యలు, పనులను సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ గా పరిగణించింది. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్‌కు 6నెలలు జైలు శిక్ష విధిస్తున్నట్లు సుప్రీంకోర్టు మంగళవారం న్యాయ వ్యవస్థలోనే సంచలన తీర్పునిస్తూ ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదిలావుండగా సోమవారం జస్టిస్ కర్ణన్ భారతదేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌కు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష […]