వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ ఎన్నికల అధికారిగా నటిస్తున్న సోషల్ డ్రామా మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌ తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఆనంది కథానాయిక. ఈ నెల 25న సినిమా థియేటర్లలో విడుదలౌతున్న నేపధ్యంలో ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గానిర్వహించారు. హీరో శ్రీవిష్ణు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. దర్శకులు ఇంద్రగంటి మోహన్ కృష్ణ, తిరుమల కిషోర్, విఐ ఆనంద్, విజయ్ కనకమేడల, వశిష్ట, రామ్ అబ్బరాజు, నిర్మాతలు సతీష్ వర్మ, అభిషేక్ అగర్వాల్ అతిధులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో సూపర్ స్టార్ కృష్ణ గారికి చిత్ర యూనిట్ నివాళులు అర్పించింది. హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి వచ్చిన అతిథులు అందరికీ కృతజ్ఞతలు. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మా కడలి గారు అద్భుతమైన ఆర్ట్ వర్క్ చేశారు. ప్రతి ఫ్రేము రిచ్ గా వుంటుంది. డీవోపీ రాం రెడ్డిగారు సినిమాని అద్భుతంగా చూపించారు. ఇందులో నేను చాలా అందంగా వున్నాని చెబుతున్నారు. నన్ను అంత అందంగా చూపించిన డీవోపీ రాం రెడ్డి గారి కిథాంక్స్. ఎడిటర్ చోటా ప్రసాద్ గారు ఆల్ రౌండర్ గా పని చేశారు. శ్రీచరణ్ చాలా హార్డ్ వర్కింగ్ కంపోజర్. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఒక డ్యాన్స్ నెంబర్ కూడా వుంది. మాటల రచయిత అబ్బూరి రవి నాంది సినిమా నుండి పరిచయం. ఆయన చాలా సపోర్ట్ చేశారు. ఇందులో ఒక పాట కూడా పాడారు. ప్రసాద్ గారికి హ్యాపీ బర్త్ డే. ఆయనకి గిఫ్ట్ 25న ఇస్తాం. ఈ సినిమాతో పరిచయం అవుతున్న నిర్మాత రాజేష్ దండా, దర్శకుడు మోహన్ .. ఇద్దరికీ కంగ్రాట్స్. రాజేష్ కి మినీ దిల్ రాజు అని పేరు పెట్టాం. మొదటి సినిమా విడుదల కాకముందే మరో రెండు సినిమాలు స్టార్ట్ చేశారు. దిల్ రాజు గారిలానే పెద్ద నిర్మాత కావాలి. మోహన్ గారు చాలా ప్రతిభ వున్న దర్శకుడు. కథ సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చేశాం. అందరం ఒక టీం వర్క్ గా ఈ సినిమా చేశాం. అనంది గారు ఈ సినిమా చేస్తున్నపుడు బేబీకి బర్త్ ఇచ్చి మూడో నెల. ఆమె చాలా కష్టపడతూ ఏ రోజు కష్టాన్ని బయటికి చెప్పాకుండా చేశారు. ఆనంది అద్భుతమైన నటి. ఆమెతో పని చేయడం చాలా అనందంగా వుంది. వెన్నెల కిషోర్, ప్రవీణ్ .. ఇలా అందరూ అద్భుతంగా చేశారు. ఇది సీరియస్ సినిమా అని చాలా మంది అనుకుంటారు. కాదు. ఇందులో 40 శాతం కామెడీ వుంటుంది. 60 శాతం ఎమోషన్ వుంటుంది. సినిమా అద్భుతంగా వచ్చింది. నా కెరీర్ నాంది లాంటి విభిన్నమైన సినిమా ఇచ్చిన నిర్మాత సతీష్ గారికి, దర్శకుడు విజయ్ కి థాంక్స్. మాకు ఎల్లవేళలా తోడుండే వంశీ- శేఖర్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్. వారి సపోర్ట్ మర్చిపోలేనిది. మాకు, మా టీంకి వారి సపోర్ట్ ఎప్పుడూ ఇలానే వుండాలి. ఇందులో నేను టీచర్ గా కనిపిస్తా. ఈ సందర్భంగా నేను స్టూడెంట్ గా వున్నపుడు కొన్ని యాక్టింగ్ �