‘అహం – రీబూట్’ రివ్యూ

నటుడు: సుమంత్
సినిమాటోగ్రఫి: వరుణ్ అంకర్ల
సంగీతం: శ్రీరామ్ మడూరీ
ఎడిటింగ్‌: మురళీ కృష్ణ మన్యం
నిర్మాత: రఘువీర్ గోరిపర్తి
దర్శకత్వం: ప్రశాంత్ సాగర్ అట్లూరి
విడుదల తేది: 30-06-2024 (ఆహా)

సుమంత్‌ హీరోగా ప్రశాంత్‌ సాగర్‌ అట్లూరి రూపొందించిన చిత్రం ‘అహం రీబూట్‌’. రఘువీర్‌ గోరిపర్తి, సృజన్‌ యరబోలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీని మొదట థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు. అనివార్య కారణాల వలన నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఆహా వేదికగా జూన్‌ 30 నుంచి ‘అహం రీబూట్’ స్ట్రీమింగ్ అవుతుంది. సుమంత్ సోలో క్యారెక్టర్ గా వెబ్ ఫిల్మ్ గా వచ్చిన ‘అహం – రీబూట్’ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ
ఇది సింగిల్ లొకేష‌న్‌, సింగిల్ ఆర్టిస్ట్ సినిమా. ఈ మూవీలో సుమంత్ త‌ప్ప మ‌రో న‌టుడు క‌నిపించ‌డు. కథ విషయానికొస్తే.. నిలయ్ (సుమంత్) ఫుల్ ప్లేయర్ గా మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటాడు. ఓ యాక్సిడెంట్ అతని జీవితాన్ని మార్చేస్తుంది. అదే యాక్సిడెంట్ లో అతని కారణంగా ఓ అమ్మాయి చనిపోతుంది. ఆ ఘటన నుంచి కోలుకున్న నిలయ్.. రేడియో జాకీగా కొత్త ప్రయాణం మొదలుపెడతాడు.

ఓ రోజు రేడియో స్టేషన్ కు ఓ అమ్మాయి ఫోన్ చేస్తుంది. తాను ఆపదలో ఉన్నానని, కాపాడమని కోరుతుంది. తొలుత ఫ్రాంక్ కాల్ గా భావించినా.. ఆ తర్వాత అది సీరియస్ అని అర్థమవుతుంది. పోలీసులు కూడా ఆ అమ్మాయిని కనిపెట్టే బాధ్యతను నిలయ్ కే అప్పగిస్తారు. మరి.. ఆ అమ్మాయిని నిలయ్ కాపాడాడా? ఆ ప్రయాణంలో అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అనేదే ‘అహం – రీబూట్’ కథ.

విశ్లేషణ
నేటితరం దర్శకులు కొత్త తరహా కథలతో ప్రయోగాలు చేస్తున్నారు. అలాంటి ప్రయోగాత్మక కథ ‘అహం – రీబూట్’. ఈ సినిమా కథంతా ఒకే క్యారెక్టర్ తో ఒకే లొకేషన్ లో సాగుతుంది.

దాదాపు గంటన్నర సేపు ఒకే క్యారెక్టర్ తో ప్రేక్షకులకు అన్ని రకాల ఎమోషన్స్ ను అందించడం అంటే మామూలు విషయం కాదు. సినిమా ఆద్యంతం ప్రేక్షకుడిని స్క్రీన్ కు కట్టిపడేసేటట్టు చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడని చెప్పొచ్చు. కొత్త డైరెక్టర్ ప్రశాంత్ మొదటి సినిమానే చాలా గ్రిప్ తో తీశాడు. ఒకే క్యారెక్టర్ తో ఎక్కడా బోర్ కొట్టకుండా సినీమా తీయటం డైరెక్టర్ దగ్గర ఉన్న గొప్ప విషయం.

ఈ మూవీలో ఒకే క్యారెక్టర్ స్క్రీన్ పై కనిపించినా.. కొన్ని వాయిస్ లు మాత్రం వినిపిస్తూ ఉంటాయి. ఫోన్‌లో వారితో సుమంత్ మాట్లాడిన‌ట్లుగా చూపిస్తూ సినిమాను క్లైమాక్స్ వ‌ర‌కు ఉత్కంఠ‌భ‌రితంగా నడిపించారు.

సింగిల్ క్యారెక్ట‌ర్ మూవీ చేయ‌డం అన్నది ఎంతో ప్రయోగాత్మకమైనది. ఒకే చోట ఉంటూ ఎమోషన్స్ పండిస్తూ కథను రక్తికట్టించడం చాలా కష్టం. ఇక.. ఈ సింగిల్ క్యారెక్టర్ లో ఇమిడిపోయి ఆ పాత్రకు బలాన్ని చేకూర్చాడు సుమంత్.

చివరగా
సినిమా మొత్తం ఒకటే క్యారెక్టర్ ఉండడం కొన్ని చోట్ల బోరింగ్ ఫీలింగ్ కలిగిస్తుంది. మొత్తంమీద.. సుమంత్ సింగిల్ క్యారెక్టర్ తో చేసిన ప్రయోగం ‘అహం – రీబూట్’ మెచ్చుకోదగినది.

రేటింగ్:3/ 5

Related Posts