‘కల్కి’లో ఆ అబ్బాయి పాత్ర వెనుక సీక్రెట్ ఏంటి?

రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి’ వరల్డ్ వైడ్ గా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తుంది. ఇప్పటికే రూ.600 కోట్లు మైలురాయిని దాటేసిన ఈ చిత్రం లాంగ్ రన్ లో రూ.1000 కోట్లు కొల్లగొడుతుందనే అంచనాలున్నాయి. ఇక.. ఈ సినిమాలో ప్రధాన తారాగణంతో పాటు.. సహాయ పాత్రల్లో అలరించిన వారిలో చాలా మంది కొత్త వాళ్లున్నారు. అలాంటి వారిలో రైయా అనే చిన్న పిల్లాడి పాత్ర ఒకటి.

ఫ్యూచర్ లో సినిమా మొదలనప్పుడు కాశీకి ప్రయాణించే సమయంలో రాజేంద్రప్రసాద్ తో పాటు ఆ పాత్ర ఉంటుంది. ఆ తర్వాత అమితాబ్ పోషించిన అశ్వథ్థామ వద్దకు చేరుతుంది. అశ్వథ్థామ చరిత్రను తెలుసుకుంటూ.. మనకు మహాభారతాన్ని పరిచయం చేసే పాత్ర కూడా అదే. అయితే.. సినిమాలో ట్విస్ట్ ఇచ్చినట్టే.. ఈ మూవీలో ఆ పిల్లాడి క్యారెక్టర్ చేసింది ఓ అమ్మాయి. కేరళకు చెందిన కేయా నాయర్ ఆ క్యారెక్టర్ లో నటించింది.

‘కల్కి’ మూవీలో రాజేంద్రప్రసాద్ క్యారెక్టర్.. ఆ పిల్లాడిని నువ్వు అమ్మాయి కదా అంటాడు. కాదు.. నేను అబ్బాయినే అంటోంది. సినిమాలో కూడా అబ్బాయిగానే ఆ క్యారెక్టర్ ను చూపించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. అయితే.. కాంప్లెక్స్ లో అమ్మాయిలందరినీ ప్రిగ్నెంట్స్ గా మార్చి.. హతమారుస్తున్నారనే ఉద్దేశ్యంతోనే ఆ అమ్మాయి అబ్బాయిగా మారిందా? అసలు సినిమాలో రైయా క్యారెక్టర్ ఫ్లాష్ స్టోరీ ఏంటి? అనేది సీక్వెల్ లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related Posts