‘ఓజీ’ వాయిదా వెనుక అసలు కారణం ఏంటి

రీ ఎంట్రీలో ఏడాదికి ఒక సినిమా చొప్పున విడుదల చేస్తోన్న పవన్.. ఈ సంవత్సరం మాత్రం రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టే.. ఈ ఏడాది సెప్టెంబర్ లో ‘ఓజీ’ విడుదల తేదీ ఖరారు చేసుకుంటే.. ఇదే ఏడాది ‘హరిహర వీరమల్లు’ మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్.

పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటింగ్ ‘ఓజీ’ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణంలో సుజీత్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ పార్ట్ చాలా వరకూ కంప్లీట్ అయ్యింది. ఎన్నికల పూర్తైన తర్వాత పవర్ స్టార్ కొన్ని రోజుల పాటు ‘ఓజీ’ చిత్రీకరణలో పాల్గొంటే సరిపోతుందట. అయితే.. లేటెస్ట్ గా సెప్టెంబర్ 27నే సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ‘లక్కీ భాస్కర్’ విడుదల తేదీ ఖరారు చేసుకుంది.

సితార నిర్మాత నాగవంశీ సెప్టెంబర్ 27న పవన్ సినిమా రాకపోవడంతోనే తాము వస్తున్నామని చెప్పారు. దాంతో.. సెప్టెంబర్ లో ‘ఓజీ’ రావడం లేదని పక్కా క్లారిటీ వచ్చేసింది. అయితే.. ‘ఓజీ’ విడుదల వాయిదా పడడం వెనుక అసలు కారణం ఈ సినిమా ఓటీటీ డీల్ పూర్తికాకపోవడమేనట. త్వరలోనే.. షూటింగ్ మొత్తం పూర్తి చేసి.. నాన్-థియేట్రికల్ బిజినెస్ పూర్తైన తర్వాత ‘ఓజీ’ కోసం కొత్త విడుదల తేదీని ఖరారు చేస్తుందట టీమ్.

Related Posts