లేటైనా లేటెస్ట్ గా వస్తోన్న విక్రమ్

కొన్నిసార్లు కొన్ని సినిమాలు సంవత్సరాల తరబడి నిర్మాణంలో ఉండిపోతుంటాయి. అలాంటి వాటిల్లో ఎక్కువ భాగం ఆర్థిక పరమైన కారణాలే కావచ్చు. చియాన్ విక్రమ్ నటించిన ‘ధృవ నచ్చత్తిరమ్’ సినిమాది అదే పరిస్థితి. 2016లోనే చిత్రీకరణ మొదలుపెట్టుకున్న ‘ధృవ నచ్చత్తిరమ్’ 2018లోనే విడుదలవ్వాల్సి ఉంది. అయితే.. ఆర్థిక కారణాల వల్ల ఈ సినిమా విడుదలకు ఇంతకాలం పట్టింది.

విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ‘ధృవ నచ్చత్తిరమ్’ ఎట్టకేలకు విడుదలవుతోంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలోని ఫస్ట్ పార్ట్ ‘యుద్ధ కాండమ్’ను నవంబర్ 24న విడుదల చేయబోతున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ తమిళ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

26/11 ఇన్సిడెంట్ తర్వాత టెర్రరిజమ్ ను అంతం చేయడానికి ‘బేస్ మెంట్’ పేరుతో ఓ స్పెషల్ టీమ్ ను రెడీ చేస్తోంది ఇండియన్ గవర్న్ మెంట్. పదకొండు మంది ఉండే ఈ స్పెషల్ టీమ్ కి స్పెషల్ పవర్స్ ఉంటాయి. ఈ టీమ్ ను లీడ్ చేస్తూ అగ్రెసివ్ గా దూసుకుపోయే పవర్ ఫుల్ ఆఫీసర్ పాత్రలో విక్రమ్ కనిపించబోతున్నాడు.

ట్రైలర్ ను చూస్తుంటే రిచ్ విజువల్స్ తో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటుంది. గౌతమ్ మీనన్ స్టైలిష్ మేకింగ్ ప్రతీ ఫ్రేములోనూ కనిపిస్తుంది. ఈ సినిమాలో విక్రమ్ కి జోడీగా రితూ వర్మ నటించగా.. ఇతర కీ రోల్స్ లో సిమ్రాన్, రాధిక, పార్థిబన్ కనిపించనున్నారు. ‘జైలర్’లో విలన్ గా మెప్పించిన వినాయకన్ ఈ సినిమాలోనూ మెయిన్ విలన్ గా అలరించబోతున్నాడు. డైరెక్టర్ గౌతమ్ మీనన్ కూడా కేమియోలో కనిపిస్తున్నాడు. ఇంకా.. టెక్నికల్ ఫ్రంట్ లో హరీష్ జైరాజ్ మ్యూజిక్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ కూడా ఈ చిత్రానికి ప్లస్ అని చెప్పాలి. త్వరలోనే ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను విడుదల చేయనున్నారట. మొత్తంమీద.. లేటైనా లేటెస్ట్ గా వస్తోన్న విక్రమ్ ‘ధృవ నచ్చత్తిరమ్’తో హిట్ కొడతాడేమో చూడాలి.

Related Posts