విజయ్ సేతుపతి 50వ చిత్రం ‘మహారాజ’

కోలీవుడ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి 50 సినిమాల మైలురాయికి చేరుకున్నాడు. అతని కెరీర్ లో 50వ చిత్రంగా రూపొందుతోంది ‘మహారాజ’. ఈ సినిమాకి నిథిలన్ సామినాథన్ దర్శకుడు. ఈ మూవీలో ‘మహారాజ’గా టైటిల్ రోల్ లో కనిపించబోతున్నాడు విజయ్ సేతుపతి. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నటరాజ్, భారతీరాజా, అభిరామి వంటి వారు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. లేటెస్ట్ గా ‘మహారాజ’ ట్రైలర్ రిలీజయ్యింది.

మహారాజ్ ఓ సెలూన్ షాప్ నడిపిస్తుంటాడు. తన ఇంట్లో నుంచి లక్ష్మిని ఎవరో దొంగిలించారంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు? అసలు ఆ లక్ష్మీ ఎవరు? ఆమె మనిషా? కాదా? అన్నది ట్రైలర్ లో సస్పెన్స్ గానే ఉంచారు. విజయ్ సేతుపతి మార్క్ వెర్సటాలిటీ ఉన్న సబ్జెక్ట్ తో వస్తోన్న ‘మహారాజ’ ట్రైలర్ అయితే బాగుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related Posts