తిరుమలలో మొక్కు తీర్చుకున్న త్రివిక్రమ్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తిరుమల శ్రీవారి దర్శనార్థం అలిపిరి కాలిబాట మార్గం గుండా తిరుమలకు చేరుకున్నారు. అందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక.. ఇటీవలే త్రివిక్రమ్ చిరకాల మిత్రుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సృష్టించిన ప్రభంజనం గురించి తెలిసిందే. పవర్ స్టార్ విజయం కూడా త్రివిక్రమ్ తిరుమలలో మొక్కు తీర్చుకోవడానికి ఒక కారణమనే ప్రచారం జరుగుతుంది.

ఇక.. సినిమాల విషయానికొస్తే.. ఇప్పటికే అల్లు అర్జున్ తో తన అప్ కమింగ్ అనౌన్స్ చేశాడు త్రివిక్రమ్. నాల్గవసారి వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నారు. ఈసారి.. బన్నీ కోసం ఓ సోషియో ఫాంటసీ సబ్జెక్ట్ ను ఎంచుకున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కోసమే దాదాపు సంవత్సరం పాటు సమయం పడుతోందని అప్పట్లో బన్నీ వాసు తెలిపాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయట.

బన్నీ సినిమా కంటే ముందే నాని లేదా రామ్ లలో ఒకరితో త్రివిక్రమ్ సినిమా చేస్తాడనే ప్రచారం జరిగింది. కానీ.. ఆ ప్రాజెక్ట్స్ పై ఎలాంటి అప్డేట్స్ లేవు. పైగా.. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ పోస్ట్ పోన్ అవ్వడం.. మరోవైపు బన్నీ చేయాల్సిన అట్లీ ప్రాజెక్ట్ సస్పెన్స్ లో పడటం వంటి కారణాలతో.. ముందుగా అల్లు అర్జున్ సినిమానే మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ డిసెంబర్ నుంచే అల్లు అర్జున్-త్రివిక్రమ్ మూవీ పట్టాలెక్కే అవకాశాలున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది.

Related Posts