‘పుష్ప 2’ ఐటెం సాంగ్ లో త్రిప్తి డిమ్రి

కొన్ని కాంబినేషన్స్ లో రూపొందే సినిమాలకు ప్రత్యేక గీతాలే ప్రధాన ఆకర్షణ. అలాంటి కాంబోస్ లో సుకుమార్ – దేవిశ్రీ ప్రసాద్ కలయిక ఒకటి. వీరి కాంబినేషన్ అంటేనే ఆ చిత్రంలో ఐటెం నంబర్ ఏ రేంజులో ఉండబోతుంది? అనే ఊహాగానాలు ఉంటాయి. వాటికి మించిన రీతిలో ‘పుష్ప’ చిత్రంలోని స్పెషల్ ఐటెం నంబర్ ను తీర్చిదిద్దారు.

‘పుష్ప 1’ స్పెషల్ నంబర్ కు మించిన రీతిలో ‘పుష్ప 2’ కోసం ఓ ఐటెం నంబర్ తీర్చిదిద్దాడట రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్. ఈ పాటకోసం ఇప్పటికే చాలామంది కథానాయికలను అనుకున్నారు. దిశా పటాని, శ్రీలీల వంటి వారు ఈ స్పెషల్ నంబర్ లో నటించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అవేమీ వర్కవుట్ కాలేదు. అయితే.. లేటెస్ట్ గా ‘పుష్ప 2’ స్పెషల్ సాంగ్ కోసం ‘యానిమల్’ బ్యూటీ త్రిప్తి డిమ్రీ పేరు వినిపిస్తోంది.

‘యానిమల్’ మూవీలో మెయిన్ హీరోయిన్ రష్మిక అయినా.. తనదైన గ్లామరస్ పెర్ఫామెన్స్ తో త్రిప్తి ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఈ అమ్మడికి బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇప్పుడు ‘పుష్ప 2’లోని ఐటెం నంబర్ కోసం త్రిప్తిని సంప్రదిస్తున్నారట మేకర్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో స్పెషల్ నంబర్ చేసే ఛాన్స్ త్రిప్తిని వరిస్తోందా? లేదా? అనే దానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

Related Posts