మే 31న ముక్కోణపు పోరు

ఇప్పటివరకూ సమ్మర్ సీజన్ అంతా చప్పగా సాగింది. ఎన్నికలు, ఐ.పి.ఎల్ వంటి వాటితో బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి పెద్దగా లేదు. ఇక.. మళ్లీ ఇప్పుడిప్పుడే థియేటర్ల వద్ద పండగ వాతావరణం మొదలవ్వబోతుంది. ముఖ్యంగా.. మే 31న మూడు మీడియం రేంజ్ మూవీస్ మధ్య బాక్సాఫీస్ పోరు జోరుగానే సాగబోతుంది. విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, కార్తికేయ ‘భజే వాయు వేగం’, ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేశా’ సినిమాలు బాక్సాఫీస్ వార్ కి రెడీ అవుతున్నాయి.

ఈ మూడు సినిమాలూ ఫక్తు యాక్షన్ ఎంటర్ టైనర్స్ గా రాబోతున్నాయి. అయితే.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రానికి పీరియడ్ టచ్ తో పాటు పొలిటికల్ టచ్ ఇచ్చారు. ఇక.. ‘గం గం గణేశా, భజే వాయు వేగం’ సినిమాలు ఆద్యంతం క్రైమ్ థ్రిల్లర్ గా సాగబోతున్నాయి. అలాగే.. ఈ మూడు చిత్రాలు కూడా బడా ప్రొడక్షన్ హౌజెస్ నుంచి వస్తున్నాయి. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ వెనుక సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఉంటే.. ‘భజే వాయు వేగం’ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్ నిర్మించింది. అలాగే.. ‘గం గం గణేశా, భజే వాయు వేగం’ రెండు సినిమాలకు నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ సపోర్ట్ కూడా ఉంది.

Related Posts