అప్పుడు ‘ఆచార్య‘ ఇప్పుడు ‘భారతీయుడు 2‘.. కాజల్ కి అన్యాయం

సీనియర్ బ్యూటీ కాజల్ అగర్వాల్.. పెళ్లి తర్వాత కూడా సినిమాల స్పీడును కంటిన్యూ చేస్తోంది. బాలకృష్ణతో నటించిన ‘భగవంత్ కేసరి‘తో బడా హిట్ అందుకున్న కాజల్.. ప్రస్తుతం ‘సత్యభామ‘ సినిమాని విడుదలకు ముస్తాబు చేసింది. రేపు వరల్డ్ వైడ్ గా ‘సత్యభామ‘ గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనుంది కాజల్.

మరోవైపు.. విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ‘భారతీయుడు 2‘లోనూ కాజల్ నటించింది. ఈ చిత్రంలో బాగా వయసు మళ్లిన పాత్రలో కాజల్ కనిపించనుంది. ఒకవిధంగా ఆ పాత్రలో ఉంది కాజలేనా? అనే సందేహం కూడా కలుగుతుందట. సీనియర్ కమల్ కి జోడీగా కనిపించనుంది కాజల్. అయితే.. కాజల్ నటించిన సన్నివేశాలు ‘భారతీయుడు 2‘లో కనిపించవు అనేది ఇప్పుడు కోలీవుడ్ టాక్. ఆమె నటించిన సన్నివేశాలన్నీ మరో సీక్వెల్ ‘భారతీయుడు 3‘లో ఉంటాయట.

అప్పట్లో మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య‘లో నటించింది కాజల్. అయితే.. ఆ సినిమాలో రామ్ చరణ్ రోల్ ఎక్కువవ్వడం వలన.. కాజల్ సన్నివేశాలు తగ్గించాల్సి వచ్చింది. ఆ తగ్గించడం కాస్తా.. టోటల్ గా సినిమా నుంచే ఆమె సన్నివేశాలను తీసేశారు. అప్పుడు ‘ఆచార్య‘లో అయినట్టే.. ఇప్పుడు ‘భారతీయుడు 2‘లోనూ కాజల్ కి అన్యాయం జరిగిందనే ప్రచారం నెట్టింట జోరుగా సాగుతోంది.

Related Posts