రెగ్యులర్ షూటింగ్ లో ‘ది గర్ల్ ఫ్రెండ్’

నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. యాక్టర్ కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రం ఇప్పటికే ముహూర్తాన్ని పూర్తిచేసుకుంది. లేటెస్ట్ గా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలైంది.

20 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ లో రష్మికతో పాటు ఇతర కీలక నటీనటులు పాల్గొంటారట. వైవిధ్యమైన ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీకి లేటెస్ట్ టాలీవుడ్ మ్యూజికల్ సెన్సేషన్ హేషమ్ అబ్దుల్ వహబ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మరోవైపు రష్మిక హీరోయిన్ గా నటించిన ‘యానిమల్’ పాన్ ఇండియా లెవెల్ లో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాలో హీరో రణ్ బీర్ కపూర్ తో పాటు.. హీరోయిన్ గా గీతాంజలి పాత్రలో తన పెర్ఫామెన్స్ ను పీక్స్ లో చూపించింది రష్మిక.

Related Posts