‘తన ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేష్ ‘బేబి’ అనే సినిమా తీశాడు.. సాక్ష్యాలతో సహా సాయి రాజేష్ మీద ‘బేబీ లీక్స్’ అనే బుక్ అందుబాటులోకి తెచ్చాను‘ అంటున్నాడు ‘ప్రేమించొద్దు’ సినిమా దర్శకుడు శిరిన్ శ్రీరామ్. ‘రవి కిరణ్ అనే వ్యక్తిని 2015లో కలిశాను. తరువాత రవి కిరణ్ ఫేస్ బుక్లో పెట్టిన పోస్ట్ చూసి ఓ పాయింట్ అనుకున్నాను. ఓ అమ్మాయిని ఇద్దరబ్బాయిలు కలిసి చంపారనే పోస్ట్ చూసి కథ అనుకున్నాం.
![](https://telugu70mm.com/wp-content/uploads/cwv-webp-images/2024/05/WhatsApp-Image-2024-05-26-at-12.37.09-PM-1.jpeg.webp)
![](https://telugu70mm.com/wp-content/uploads/cwv-webp-images/2024/05/WhatsApp-Image-2024-05-26-at-12.37.09-PM.jpeg.webp)
దాన్ని ఓ బస్తీ అమ్మాయి పాత్రతో లింక్ చేసి కథ రాసుకున్నా. ఆ టైంలో నిర్మాత సాయి రాజేష్ గారితో ఏడాది ప్రయాణం చేశాను. నాకు దర్శకుడిగా అవకాశం ఇస్తూ ఆయనే సినిమాను నిర్మిస్తానని అన్నారు. అయితే ఆలస్యం అవుతూ వచ్చింది. కారణాలేమైనా ఉండొచ్చేమో అనిపించి, ఆయన సినిమా నిర్మించడం లేదని నేను బయటకు వచ్చేశాను. అప్పుడు మాకేం గొడవ జరగలేదు. తర్వాత నాకు దర్శకత్వం అవకాశం ఇస్తానన్నాడు. నా కథను కాపీ కొట్టి అదే బస్తీ అమ్మాయి.. ఇద్దరబ్బాయిల్ని ప్రేమించే కథతో ‘బేబీ‘ అనే ఓ బూతు సినిమా తీశాడు‘ అని శిరీన్ శ్రీరామ్ చెప్పాడు.
![](https://telugu70mm.com/wp-content/uploads/cwv-webp-images/2024/05/IMG_8621-Telugu.jpg.webp)
![](https://telugu70mm.com/wp-content/uploads/cwv-webp-images/2024/05/still-12-Telugu.jpg.webp)
![](https://telugu70mm.com/wp-content/uploads/cwv-webp-images/2024/05/PC-Poster-Telugu.jpg.webp)
![](https://telugu70mm.com/wp-content/uploads/cwv-webp-images/2024/05/Baby-Leaks.jpg.webp)
2023 జూలైలో సినిమా రిలీజ్ అయినప్పుడు రచ్చ చేయలేదు. నాకు రియలైజ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. సాక్ష్యాలు అన్నీ సంపాదించి లాయర్ నిఖిలేష్ గారిని కలిశాను. కాపీరైట్ లీగల్ నోటీస్ పంపాం. కానీ నాకే ఆయన ఆ కథను చెప్పాడని ఆ నోటీసులో రిప్లై ఇచ్చాడు. ‘హృదయ కాలేయం‘ సినిమాకు ఫ్రీగా టీజర్ డైరెక్ట్ చేసి, ఎడిట్ చేసి ఇచ్చాను. సాయం చేసిన వాళ్లకే వెన్నుపోటు పొడిచే రకం. ఫిబ్రవరిలో రాయదుర్గంలో కేస్ ఫైల్ చేశాను. నన్ను బద్నాం చేసేందుకు ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఫిర్యాదులు చేశాడు. ఆయన మీద బేబీ లీక్స్ అనే పుస్తకాన్ని కూడా రాశాను. దాన్ని మీడియా ముందుకు తీసుకొస్తున్నాను. https://babyleaks2023.blogspot.com/ అనే ఆన్ లైన్లో మాధ్యమంలో పీడీఎఫ్ కూడా ఉంది. వెబ్ సైట్ కూడా ఉంది. గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నాడు‘ అని శిరీన్ తాను డైరెక్ట్ చేసిన ‘ప్రేమించొద్దు‘ సినిమా ప్రెస్ మీట్ లో ఈ విషయాలు తెలిపాడు.