‘భారతీయుడు 2’ నుంచి ‘తాత వస్తాడే’ గీతం

విశ్వనటుడు కమల్ హాసన్, భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కలయికలో వస్తోన్న చిత్రం ‘భారతీయుడు 2’. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో సినిమా ప్రచారంలో స్పీడు పెంచింది టీమ్. అనిరుధ్ స్వరకల్పన చేసిన ఈ చిత్రం తమిళ గీతాలు ఇప్పటికే విడుదలయ్యాయి. ఇప్పుడు తెలుగు పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు.

ఇప్పటికే ‘భారతీయుడు 2’ నుంచి విడుదలైన ‘శౌర, చెంగలువ’ పాటలకు మంచి స్పందన వచ్చింది. ‘శౌర’ గీతం ప్రీ-ఇండిపెండెన్స్ బ్యాక్‌డ్రాప్ తో అలరించగా.. ‘చెంగలువ’ సిద్ధార్థ్-రకుల్ ప్రీత్ సింగ్ మధ్య రొమాంటిక్ గా చిత్రీకరించారు. ఇప్పుడు ‘తాత వస్తాడే’ అంటూ సిద్ధార్థ్ పాడే గీతాన్ని రిలీజ్ చేసింది చిత్రబృందం. కరప్షన్ పై మళ్లీ కదం తొక్కడానికి తాత సేనాపతి రాబోతున్నాడని హింట్ ఇస్తూ సాగే ఈ పాటలో ప్రియా భవానీ శంకర్ కూడా కనిపిస్తుంది. శంకర్ స్టైల్ లో భారీగా చిత్రీకరించిన ఈ పాటకు బాబా భాస్కర్ కొరియోగ్రఫీ నిర్వహించాడు. కాసర్ల శ్యామ్ రాసిన ఈ గీతాన్ని అరుణ్ కౌండిన్య ఆలపించాడు.

‘భారతీయుడు-2’.. ‘జీరో టోలరెన్స్’ అనేది ఈ మూవీకి ట్యాగ్ లైన్. ఇక.. కరప్షన్ కాజెస్ క్యాన్సర్ టు ది నేషన్.. కరప్షన్ కిల్స్ అనే నినాదంతో శంకర్ తెరకెక్కించిన ‘భారతీయుడు 2’ జూలై 12న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts