సమ్ థింగ్ స్పెషల్ గా ‘ఎక్స్ ట్రా – ఆర్టినరీ మ్యాన్’

యూత్ స్టార్ నితిన్ ఈసారి సరికొత్తగా రాబోతున్నాడు. కొత్త చిత్రం ‘ఎక్స్ ట్రా – ఆర్డినరీ మ్యాన్’లో సమ్ థింగ్ స్పెషల్ గా మెప్పించడానికి ముస్తాబవుతున్నాడు. రైటర్ వక్కంతం వంశీ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ చిత్రానికి టైటిల్ ‘ఎక్స్ ట్రా’. ‘ఆర్డినరీ మ్యాన్’ అనేది ట్యాగ్ లైన్. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు.

ఈ మూవీ టైటిల్ ను బట్టే ఈ సినిమాలో ఎక్స్ ట్రా అంటే జూనియర్ ఆర్టిస్టు క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు నితిన్. ఈ టీజర్ లో ‘బాహుబ‌లి’ చిత్రంలోని ‘దండాల‌య్యా…’ పాటలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్‌ గా కనిపించినట్టు చూపించిన విధానం హిలేరియస్ గా ఉంది. సినీ ఫీల్డ్ బ్యాక్ డ్రాప్ లో గతంలో కొన్ని సినిమాలొచ్చాయి. అయితే.. ఈ మూవీలో సినీ ఫీల్డ్ లోని సాధకబాధకాలకంటే కాస్త డిఫరెంట్ గా ట్రై చేసినట్టు కనిపిస్తుంది. హీరోయిన్ శ్రీలీలతో లవ్ ట్రాక్.. తండ్రి రావు రమేష్ తో గొడవలు.. టీజర్ లో హైలైట్ గా నిలిచాయి. ఓవరాల్ గా టీజర్ ఆద్యంతం నితిన్ మాత్రం సరికొత్తగా కనిపిస్తున్నాడు.

కాస్టింగ్ విషయానికొస్తే ఈ మూవీలో సీనియర్ యాక్టర్ రాజశేఖర్ కూడా నటించబోతున్నాడు. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే.. టీజర్ లో మాత్రం రాజశేఖర్ పాత్రకు సంబంధించి ఎలాంటి విజువల్స్ కనిపించలేదు. ఇక.. గతంలో తన సంగీతంతో కుర్రకారును ఓ ఊపు ఊపిన హ్యారీస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ‘డేంజ‌ర్ పిల్ల‌..’ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య‌మూవీస్ & ఎంట‌ర్ టైన్‌మెంట్స్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్స్‌పై సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 8న ‘ఎక్స్ ట్రా – ఆర్డినరీ మ్యాన్’ ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

Related Posts