డిసెండర్ లో పెళ్లిపీటలెక్కబోతున్న సిద్ధార్థ్-అదితి

పేరుకు తమిళవాడే అయినా.. తెలుగులో హీరోగా భారీ విజయాలు అందుకున్నాడు సిద్ధార్థ్. ‘నువ్వొస్తానంటే నేనొద్దాంటానా, బొమ్మరిల్లు’ వంటి సినిమాలు సిధ్దుకి అప్పటి యూత్ తో పాటు.. ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ తీసుకొచ్చాయి. అయితే.. గత కొన్నేళ్లుగా తమిళ చిత్రాలపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాడు. గతంలో సిద్ధార్థ్.. మేఘనా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ 2007లో విడిపోయారు.

గత కొన్ని నెలలుగా నటీమణి అదితి రావు హైదరీతో ప్రేమలో ఉన్నాడు సిద్ధార్థ్. ‘మహా సముద్రం’ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. కొన్ని రోజులుగా లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ ఆమధ్య రహస్యంగా వివాహం చేసుకున్నారనే ప్రచారం జరిగింది. కానీ.. అందులో నిజం లేదు. సిద్ధార్థ్-అదితి రావు వివాహం ఈ ఏడాది డిసెంబర్ లో జరిగే అవకాశం ఉందట.

అదితికి కూడా ఇది రెండో వివాహం. గతంలో నటుడు సత్యదీప్ మిశ్రాని వివాహమాడింది. అదితి, సత్యదీప్ మిశ్రా 2012లో విడిపోయారు. ప్రస్తుతం సిద్ధార్థ్ ‘ఇండియన్ 2’తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇక.. ఇటీవలే సంజయ్ లీల భన్సాలీ ‘హీరామండి’ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అదితి రావు.

Related Posts