శ్రీ లీల.. బ్రేకుల్లేని బ్యూటీ

శ్రీ లీల.. మూడేళ్ల క్రితం వరకూ తనెవరో కూడా తెలుగు ఆడియన్స్ కు తెలియదు. కానీ ఇప్పుడు.. మరో మూడేళ్ల వరకూ తన చేతినిండా సినిమాలున్నాయి.

ఇదంతా ఓవర్ నైట్ జరిగిన వ్యవహారం. కొందరికి అదృష్టం అలా తలుపులు తడుతుది అంతే. అలా తట్టినప్పుడు వెంటనే డోర్స్ ఓపెన్ చేస్తే ఇదుగో ఇలా బ్రేకుల్లేకుండా దూసుకుపోతుంటారు. అది ఎంత వరకూ వెళుతుందంటే ఇప్పుడు ఇండియాలో అరడజనుకు పైగా ఆఫర్స్ ఉన్న ఏకైక హీరోయిన్ గా అవతరించింది శ్రీ లీల.

2019లో కన్నడలో కిస్ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ శాండల్ సోయగం.. తెలుగులో పెళ్లి సందడి మూవీతో అడుగుపెట్టింది. ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా అమ్మడు మాత్రం అట్రాక్ట్ చేసింది. లేడి పిల్లలా గంతులు వేస్తూ.. ఛలాకీ సోయగాలతో తెలుగు ప్రేక్షకులకు కట్టి పడేసింది. కట్ చేస్తే ఓవర్ నైట్ వరుస ఆఫర్స్ చుట్టుముట్టాయి.అయితే ఏ మాటకు ఆ మాటే.. శ్రీ లీల అందగత్తె మాత్రమే కాదు. మంచి ప్రతిభ కూడా ఉంది. క్లాసికల్ డ్యాన్సర్ కావడంతో ఆ యాంగిల్ కూడా కలిసొచ్చింది. అది అన్ని ఎక్స్ ప్రెషన్స్ పలికించేందుకు ఉపయోగపడుతుంది. అందుకే పాత్ర ఏదైనా ఇట్టే పట్టేస్తుంది. పెళ్లిసందడి యావరేజ్ అయినా తర్వాత వచ్చిన ధమాకా బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీలో రవితేజ ఎనర్జీని మ్యాచ్ చేస్తూ దూకుడుగా కనిపించి మరింత ఆకట్టుకుంది.


ప్రస్తుతం తన చేతిలో తెలుగులోనే ఎనిమిది సినిమాలున్నాయి. మరో కన్నడ మూవీకీ సైన్ చేసింది. బోయపాటి రామ్ కాంబోలో వస్తోన్న చిత్రంలో తనే హీరోయిన్. బాలయ్య హీరోగా వస్తోన్న భగవంత్ కేసరిలో కథలకు కీలకమైన పాత్ర తనదే. వైష్ణవ్ తేజ్ తో ఆది కేశవ్ మూవీలోనూ తనే హీరోయిన్. నితిన్ 32 కూడా తనదే. వీటితో పాటు టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన మహేష్ బాబుతో గుంటూరు కారం, పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీస్ ను చేస్తోంది.

ఈ రెండు సినిమాలు చాలు.. తను ఎంత స్పీడ్ గా దూసుకుపోతోందో చెప్పడానికి. ఇక రీసెంట్ గా విజయ్ దేవరకొండ సినిమాకూ సైన్ చేసింది. వీటితో పాటు మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ కాంబోలో రూపొందే సినిమాలో తననూ ఓ హీరోయిన్ గా సెలెక్ట్ చేస్తారు అనే ప్రచారం జరుగుతోంది.

మొత్తంగా అమ్మడి దూకుడుకు ఇప్పట్లో బ్రేకులు లేవు. ప్రస్తుతం తను చేస్తోన్న ప్రాజెక్ట్స్ అన్నీ మోస్ట్ ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాయి. వీటిలో ఏ నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ అయినా అమ్మడి రేంజ్ కు హద్దులే ఉండవు. సౌత్ లో హయ్యొస్ట్ పెయర్ హీరోయిన్ గా ఎదిగినా ఆశ్చర్యం లేదు. మరి తను అలా ఎదగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతోంది తెలుగు 70ఎమ్ఎమ్.

Related Posts