సత్యదేవ్ బర్త్ డే స్పెషల్ గా ‘జీబ్రా‘ లుక్

నవతరం హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుని సాగుతున్నాడు సత్యదేవ్. సినిమా సినిమాకీ కథల విషయంలో వైవిధ్యం కోసం తపన పడే సత్యదేవ్.. తొలుత చిన్న పాత్రలలో మెరిశాడు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘జ్యోతిలక్ష్మి’ సినిమాతో ఫుల్ లెన్త్ హీరోగా మారాడు. ‘అంతరిక్షం, ఇస్మార్ట్ శంకర్’ వంటి సినిమాలలో హీరోలకు సమానమైన పాత్రలలోనూ అలరించాడు.

‘బ్లఫ్ మాస్టర్, బ్రోచేవారెవరురా, ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య‘ వంటి సినిమాలు సత్యదేవ్ కి నటుడిగా మంచి పేరు తీసుకొచ్చాయి. మెగాస్టార్ చిరంజీవితో నటించిన ‘గాడ్ ఫాదర్‘లో విలన్ గానూ అదరగొట్టాడు. ఈ ఏడాది ‘కృష్ణమ్మ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సత్యదేవ్.. లేటెస్ట్ గా ‘జీబ్రా‘ మూవీతో రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో సూర్య పాత్రలో అలరించనున్నాడు సత్యదేవ్. ఈరోజు (జూలై 4) సత్యదేవ్ బర్త్ డే స్పెషల్ గా ఈ మూవీ నుంచి న్యూ లుక్ రిలీజయ్యింది. ఈశ్వర్ కార్తీక్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి ‘కె.జి.యఫ్, సలార్‘ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్నందిస్తున్నాడు.

Related Posts