సందీప్ కిషన్ – నక్కిన సినిమాకి క్రేజీ టైటిల్

‘ధమాకా‘ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు నక్కిన త్రినాథరావు. అంతకుముందే మంచి విజయాలున్నా.. ‘ధమాకా‘ మాత్రం నక్కిన త్రినాథరావుని 100 కోట్ల దర్శకుడి లిస్టులో చేర్చింది. ప్రస్తుతం నక్కిన.. సందీప్ కిషన్ హీరోగా సినిమాని తెరకెక్కిస్తున్నాడు. సందీప్ కెరీర్ లో 30వ చిత్రమిది.

తండ్రీకొడుకుల ఇతివృత్తంతో సాగే ఈ ఎంటర్ టైనర్ లో.. తండ్రిగా రావు రమేష్ నటిస్తుంటే.. కొడుకు పాత్రలో సందీప్ కిషన్ కనిపించనున్నాడు. ఈ మూవీలో ‘మన్మథుడు‘ ఫేమ్ అన్షు మరో కీలక పాత్రలో కనిపించబోతుంది. ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ సినిమాకోసం ఇప్పటికే కొన్ని టైటిల్స్ వినిపించాయి. అయితే.. ‘ధమాకా‘ వంటి హిట్ తర్వాత నక్కిన చేస్తున్న సినిమా కావడంతో.. ఈ మూవీకి ‘మజాకా‘ అనే టైటిల్ ను పెట్టాలనే ప్రయత్నంలో ఉన్నారట మేకర్స్. త్వరలోనే.. ఈ టైటిల్ పై అధికారిక ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది.

Related Posts