పవన్ కళ్యాణ్ కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన సాయిధరమ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపడుతోన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి తన కుటుంబ సభ్యుల నుంచి బహుమతుల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పవర్ స్టార్ కి వదినమ్మ సురేఖ నుంచి స్పెషల్ పెన్ గిఫ్ట్ గా అందింది. మోంట్ బ్లాంక్ కంపెనీకి చెందిన అత్యంత కాస్ట్లీ పెన్ ను పవన్ కి బహుమతిగా అందించారు సురేఖ.

లేటెస్ట్ గా తన ముద్దుల మావయ్యకి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఓ స్పెషల్ గిఫ్ట్ అందించాడు. ఇప్పటికే తన మావయ్య ఎన్నికల్లో గెలిచినందుకు తిరుమల వెళ్లి మొక్కు తీర్చుకున్న సాయిధరమ్.. తన మావయ్యకి చిన్నప్పుడు ఎంతో ఇష్టమైన స్టార్ వార్స్ లెగో అల్టిమేట్ కలెక్షన్ సిరీస్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. చిన్నప్పుడు తనకు స్టార్ వార్స్ ను పరిచయం చేసిన మావయ్యకి.. ఈ గిఫ్ట్ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని సోషల్ మీడియాలో తెలిపాడు సుప్రీమ్ హీరో.

సాయిధరమ్ తేజ్ ను సినిమాల్లోకి తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ దే ప్రధాన పాత్ర. ఆయనే సాయిధరమ్ కి యాక్టింగ్ లో ట్రైనింగ్ ఇప్పించాడు. ఇక.. ఇప్పటికే ఈ మేనమామ మేనల్లుళ్లిద్దరూ కలిసి ‘బ్రో’ మూవీలోనూ నటించారు.

Related Posts