‘ఆర్.టి.75’ ముహూర్తం.. రవితేజ సరసన శ్రీలీల

మాస్ మహారాజ ప్రతిష్ఠాత్మక 75వ సినిమా ముహూర్తాన్ని జరుపుకుంది. భాను భోగారపు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో రవితేజాకి జోడీగా శ్రీలీల నటిస్తుంది. ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూరుస్తుండగా.. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్ గా, నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

ఆద్యంతం తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండనుందట. వచ్చే సంక్రాంతి కానుకగా ‘ఆర్.టి.75’ విడుదలకు ముస్తాబవుతోంది. ఇక.. ‘ధమాకా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రవితేజ-శ్రీలీల కాంబోలో రాబోతున్న సినిమా ఇది.

Related Posts