‘భారతీయుడు 2‘ నుంచి రొమాంటిక్ సాంగ్ ప్రోమో

విశ్వనటుడు కమల్ హాసన్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘భారతీయుడు 2‘. క్లాసిక్ మూవీ ‘భారతీయుడు‘కి సీక్వెల్ గా రాబోతున్న చిత్రమిది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘శౌరా‘ రిలీజయ్యింది. ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ పాటకు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ‘చెంగలువ‘ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అనిరుధ్ స్వరకల్పనలో సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ గీతాన్ని రేపు (మే 29) ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. ఇక.. ఈ పాట ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ లపై చిత్రీకరించారు. శంకర్ తనదైన శైలిలో ఎంతో భారతనంతో స్టైలిష్ గా ఈ సాంగ్ ను చిత్రీకరించినట్టు ప్రోమోను చూస్తే అర్థమవుతోంది. జూన్ 1న ‘భారతీయుడు 2‘ ఆడియో ని గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేయబోతున్నారు. జూలై 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Related Posts