పూరి తో పోటీకి రెడీ అవుతోన్న రవితేజ

మాస్ మహారాజ రవితేజ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మధ్య మంచి అవినాభావ సంబంధం ఉంది. అసలు రవితేజను స్టార్ హీరోగా మార్చడంలో కీలక భూమిక పూరి జగన్నాథ్ దే. ఇప్పటికే వీరిద్దరూ కలిసి అరడజను సినిమాల వరకూ చేశారు. అయితే.. ఈసారి బాక్సాఫీస్ వద్ద వేరు వేరు సినిమాలతో పోటీకి సిద్ధమవుతున్నారట.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ‘డబుల్ ఇస్మార్ట్’ ఆగస్టు 15న విడుదల తేదీ ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక.. అదే తేదీకి ఇప్పుడు రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయట.

హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని ఆగస్టు 15న విడుదల చేయాలని భావిస్తోందట నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. రెండు, మూడు రోజుల్లో ‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందట.

Related Posts