‘కుబేర’ కోసం సరికొత్తగా కనిపిస్తున్న రష్మిక

కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబోలో రూపొందుతోన్న మల్టీస్టారర్ ‘కుబేర’. క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న సినిమా ఇది. కథే తన మొదటి హీరోగా భావించే శేఖర్ కమ్ముల.. ఫస్ట్ టైమ్ ఇద్దరు స్టార్ హీరోలతో చేస్తున్న సినిమా ఇది. ఇప్పటికే చాలా భాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ‘కుబేర’ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మరో కీలక పాత్రలో కనిపించబోతుంది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి రష్మిక ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది టీమ్.

ఈ గ్లింప్స్ లో తాను దాచిపెట్టిన డబ్బుల సూట్ కేస్ కోసం ఒక దగ్గర గుంత తవ్వుతుంది రష్మిక. అక్కడ ఆ డబ్బు లభించడంతో.. ఆనందంగా ఆ సూట్ కేస్ తీసుకుని వెళ్లిపోతుంది. ఇప్పటివరకూ ఎక్కువగా గ్లామరస్ రోల్స్ లో అలరించిన రష్మిక.. ఈ సినిమాలో ఎంతో ప్రాధాన్యత గల పాత్రలో కనిపించబోతున్నట్టు ఈ గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. శ్రీవెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. త్వరలోనే.. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

Related Posts