ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయబోతున్న రష్మిక

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పుడు నెవర్ బిఫోర్ అన్నట్టుగా క్రేజీ లైనప్ తో ఉన్నాడు. ఒకటి తర్వాత ఒకటిగా వరుస పాన్ ఇండియా మూవీస్ తో మెస్మరైజ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక.. తారక్ సరసన నటించే హీరోయిన్స్ విషయంలోనూ ఎంతో కేర్ తీసుకుంటున్నారు మేకర్స్. ‘ఆర్.ఆర్.ఆర్‘లో లండన్ బ్యూటీతో రొమాన్స్ చేసిన ఎన్టీఆర్.. ప్రస్తుతం ‘దేవర‘ కోసం జాన్వీతో జోడీ కట్టాడు. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కి ఇదే తొలి సినిమా.

బాలీవుడ్ క్రేజీ మల్టీస్టారర్ ‘వార్ 2‘లో కియారా అద్వానీ కథానాయిక నటిస్తున్నా.. ఆమె ఎన్టీఆర్ కి జోడీగా కనిపించబోతుందా? హృతిక్ సరసన మెరవనుందా? అనే దానిపై క్లారిటీ లేదు. ఇక.. ఆ తర్వాత తారక్.. ప్రశాంత్ నీల్ తో చేయబోయే ‘ఎన్టీఆర్-నీల్‘ ప్రాజెక్ట్ లో హీరోయిన్ ఎవరనే దానిపై కొన్ని రోజులుగా నెట్టింట చర్చ జరుగుతోంది.

‘ఎన్టీఆర్-నీల్‘ ప్రాజెక్ట్ కి ‘డ్రాగన్‘ అనే పవర్ ఫుల్ ప్రచారంలో ఉంది. ఈ మూవీలో ఎన్టీఆర్ కి జోడీగా రష్మిక నటించనుందట. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ లోకి రష్మికను తీసుకున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. ఇప్పటివరకూ తెలుగులో మహేష్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ ను కవర్ చేసిన రష్మిక తొలిసారి ఎన్టీఆర్ తో నటించనుంది.

మరోవైపు.. ‘గాళ్ ఫ్రెండ్, రెయిన్ బో‘ అనే రెండు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటిస్తుంది. విజయ్ దేవరకొండ – రాహుల్ సంకృత్యాన్ సినిమాలోనూ రష్మిక నాయికగా నటించనుంది.

Related Posts